OMG : జిమ్ చేస్తూ యువకుడి మృతి

హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ లో విషాదం జరిగింది. జిమ్ చేస్తూ యువకుడు చనిపోయాడు. జిమ్ సెంటర్ లోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. మృతుడిని ఆదిత్యగా గుర్తించారు. జిమ్ చేస్తున్న సమయంలో ఆదిత్యకు ఛాతిలో నొప్పి వచ్చింది. ఆ నొప్పితో అక్కడే కుప్పకూలాడు. ఎస్ఆర్ నగర్ లోని గోల్డెన్ జిమ్ లో ఈ ఘటన జరిగింది.
అధికంగా జిమ్ చెయడం వల్లే ఆదిత్య చనిపోయాడని జిమ్ నిర్వాహాకులు చెబుతున్నారు. ఆదిత్య మృతికి జిమ్ నిర్వాహాకులే కారణం అని కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. గోల్డెన్ జిమ్ నిర్వాహాకులపై ఆదిత్య కుటుంబసభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. పంజాబ్ కి చెందిన ఆదిత్య డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగి.
సాధారణంగా హెల్త్ పరంగా ఫిట్ గా ఉండేందుకు జిమ్ సెంటర్ కు వెళ్తారు. ఆరోగ్య పరిరక్షణ కోసం జిమ్ సెంటర్ లో జాయిన్ అవుతారు. ట్రైనర్ పర్యవేక్షణలో ఎక్సర్ సైజులు చేస్తారు. ఆ విధంగా తమని తాము ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే అలాంటి జిమ్.. ప్రాణం పోవడానికి కారణం అవడం కలకలం రేపింది. జిమ్ చేస్తూ యువకుడు చనిపోవడం.. జిమ్ కెళ్లే వారిని షాక్ కి గురి చేసింది. వారిలో ఆందోళన నింపింది. కాగా ఆదిత్య మృతికి అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ఓవర్ గా జిమ్ చెయ్యడం వల్లే చనిపోయాడా మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది.