Extra Marital Affair : ప్రియుడితో లేచిపోయిన భార్య….పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

తాళి కట్టిన భార్య తన ప్రియుడితో లేచి పోయింది.   అది తట్టుకోలేని భర్త తన ఇద్దరు పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. 

Extra Marital Affair : ప్రియుడితో లేచిపోయిన భార్య….పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

Man Suicide

Updated On : August 6, 2021 / 9:24 AM IST

Extra Marital Affair : తాళి కట్టిన భార్య తన ప్రియుడితో లేచి పోయింది.   అది తట్టుకోలేని భర్త తన ఇద్దరు పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.  హర్యానాలోని కర్నాల్ లో 32 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు  పిల్లల్ని హత్యచేసి  తాను  అత్మహత్య  చేసుకున్న ఘటన కలకలం రేపింది.  బాధితుడికి 8 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఆ దంపతులకు 6సంవత్సరాలు,  3 సంవత్సరాలు కలిగిన ఇద్దరు మగ పిల్లలు పుట్టారు.

ఆ మహిళకు  తమ ఇంటి పొరుగున ఉన్న ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా  వివాహేతర సంబంధంగా మారింది.  జూన్ 25న ఆ ఇల్లాలు  భర్త, పిల్నల్ని వదిలేసి  ప్రియుడితో కలిసి పారిపోయింది. అనంతరం ఆమె ప్రియుడు తన ప్రియురాలి భర్తకు ఫోన్ చేసి బెదిరించసాగారు. ఆక్రమంలో ఇంత జరిగాక బతికి ఏం సాధిస్తావని బెదిరించాడు.

దీంతో తీవ్రమనస్తాపానికి గురైన ఆ వ్యక్తి   జులై 31న  తన ఇద్దరు పిల్లలకి విషమిచ్చి చంపేశాడు. అనంతరం తాను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పారిపోయిన  జంటపై    పోలీసులు కేసు నమోదు చేశారు.   వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్  306, 506లు   కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ముగ్గురి   మృతదేహాలను పోస్టుమార్టం  నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.