యువతిపై ప్రేమోన్మాది దాడి: ప్రేమించలేదని కోపం 

  • Published By: chvmurthy ,Published On : March 19, 2019 / 04:13 AM IST
యువతిపై ప్రేమోన్మాది దాడి: ప్రేమించలేదని కోపం 

Updated On : March 19, 2019 / 4:13 AM IST

హైదరాబాద్‌: తన ప్రేమను తిరస్కరించి వేరొకరిని పెళ్లి చేసుకుంటోందనే కోపంతో ఓ యువకుడు యువతిపై కత్తెరతో దాడి చేసిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్ప్రత్రికి  తరలించి  చికిత్స అందిస్తున్నారు. యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌లో నివసిస్తున్న ఒక యువతి (18)కి ఆమె అద్దెకుంటున్నఇంటి కింది పోర్షన్‌లో ఉంటున్న యన్నాబత్తుల దుర్గాప్రసాద్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడు  సమీపంలోని టైలర్‌షాపులో పనిచేస్తున్నాడు. దుర్గా ప్రసాద్ ఆయువతిని ప్రేమిస్తున్నట్లు గతంలో  చెప్పగా ఆమె నిరాకరించింది. ఇటీవల ఆ యువతికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది.
Read Also : అసలేం జరిగింది : యువజంట సజీవ దహనం

ఈవిషయం తెలిసిన దుర్గాప్రసాద్‌ సోమవారం ఆవేశంగా ఆమె ఇంటికి వెళ్లి తనను ప్రేమిస్తావా? లేదా? అంటూ గొడవపడి, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తనను కాకుండా ఇంకెవరినైనా  పెళ్లి చేసుకుంటే చంపేస్తానంటూ తనతో పాటు తెచ్చుకున్న కత్తెరతో ఆమె మెడపై పొడిచాడు.  గాయపడిన యువతి అతడి బారి నుంచి తప్పించుకొని అరుస్తూ కిందకి పరుగులు తీసింది.

దీనిని  గమనించిన టైలర్‌షాపు యజమాని యూసుఫ్‌, యువకుడిని అడ్డుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాడు.  వెంటనే అప్రమత్తమైన స్థానికులు దుర్గాప్రసాద్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.