Maoists : సర్పంచ్‌ను హతమార్చిన మవోయిస్టులు

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు.  నారాయణపూర్ జిల్లాలోని ఫరస్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మరి గ్రామ సర్పంచ్ హత్య చేశారు.

Maoists : సర్పంచ్‌ను హతమార్చిన మవోయిస్టులు

Maoists

Updated On : November 27, 2021 / 2:00 PM IST

Maoists :  చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు.  నారాయణపూర్ జిల్లాలోని ఫరస్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మరి గ్రామ సర్పంచ్ హత్య చేశారు.  నిన్న రాత్రి పెద్ద సంఖ్యలో కర్మారీ గ్రామానికి చేరుకున్నమావోయిస్టులు సర్పంచ్ బిర్జు సలామ్‌ను బయటకు పిలిచి తుపాకీతో దారుణంగా కాల్చి చంపారు.

అనంతరం గ్రామంలో మావోయిస్టులకు మద్దతుగా పోస్టర్లు, బ్యానర్లు అంతికించారు. అనంతరం ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనలో పనిచేస్తున్న  జేసీబీ  యంత్రాన్ని కూడా మావోయిస్టులు తగుల బెట్టారు. సర్పంచ్ హత్యతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.
Also Read : TTD Sarva Darshna Tickets : మూడు లక్షల టికెట్లు 16 నిమిషాల్లో అయిపోయాయి
నారాయణపూర్ జిల్లా కేంద్రం నుండి 21 కిలోమీటర్ల దూరంలో కర్మారి గ్రామం ఉంటుంది. సంఘటన మొత్తం నిన్న రాత్రి చీకటిలో జరిగిందని సర్పంచ్ భార్య ఫుల్‌డే సలామ్‌ చెప్పారు. మృతుడు బిర్జూ కు భార్య ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. భర్త మరణించటంతో కుటుంబం దిక్కులేనిది అయిపోయిందని భార్య సలామ్ అన్నారు.