32 ఏళ్ల మహిళ, కుర్ర బాయ్ ఫ్రెండ్ వల్లే ప్రెగ్నెంట్ అయ్యానని నమ్మించడానికి, నకిలీ బేబీ స్కాన్ ఫోటోస్ వాడింది!

పెళ్లి అయిన 32ఏళ్ల మహిళ.. తన 18ఏళ్ల కుర్ర బాయ్ ఫ్రెండ్‌ను మోసం చేసింది. అతడి కారణంగానే తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా తప్పుగా చెప్పింది. అతన్ని నమ్మించేందుకు ఈబే నుంచి నకిలీ బేబీ స్కాన్ ఫొటోలను 100వేల పౌండ్లతో కొనుగోలు చేసింది. ఆ ఫొటోలను చూపించి తన బిడ్డకు అతడే తండ్రి అని నమ్మించింది. ఫలితంగా అతని కుటుంబం మూడేళ్లకు పైగా వారితో సంబంధం లేని శిశువును పోషించారు. ఆమె చేసిన మోసం తేలడంతో నిందితురాలు సారా డోవ్సన్ కు మూడేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. 32 ఏళ్ల సారా డోవ్సన్‌తో కలిసి బాధితుడు జోసెఫ్ బాస్టిన్ చైనీస్ రెస్టారెంట్‌లో కలిసి పనిచేసినట్టు విచారణలో కోర్టు పేర్కొంది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య అఫైర్ నడిచింది.
ఇక తమ సంబంధాన్ని ముగించాలని టీనేజర్ డోవ్‌సన్‌కు చెప్పాడు. కానీ, ఆమె వెంటనే తాను గర్భవతి అయినట్టు నమ్మించింది. పిల్లల పోషణ కోసం అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు విచారణలో తేలింది. అసలు మోసం గ్రహించిన బాధిత యువకుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
డీఎన్ఏ పరీక్షల్లో బయటపడ్డ మోసం :
దాంతో డోవ్సన్.. బాధితుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. తనను అత్యాచారం చేసినట్టు ఆమె భర్త థామస్ కూడా డోవ్సన్ చెప్పిన ఆమెకు వంత పడాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సీక్రెట్ డీఎన్ఎ పరీక్ష ఫలితాల్లో పోలీసులు డోవ్సన్ చెప్పిందంతా అబద్దామని తేల్చేశారు. ఇదే విషయాన్ని కోర్టులో విన్నవించారు. వాస్తవానికి పుట్టిన శిశువు కుర్ర బాయ్ ఫ్రెండ్ కు పుట్టలేదు… తన భర్తే ఆ శిశువుకు తండ్రి అని పోలీసులు విచారణలో నిర్ధారించారు.
డోవ్సన్ మాటలు నమ్మిన టీనేజర్.. తనకు ఒక బిడ్డకు జన్మనిచ్చాడని టీనేజర్ తన తల్లిదండ్రులకు ముందే చెప్పాడు. అలా చెప్పడంతో అతడి కుటుంబం మూడున్నర సంవత్సరాలు పసికందును పోషించింది. కొంతకాలం తర్వాత, ఆమె తన బిడ్డను హోటల్ గదిలో గర్భస్రావం అయినట్టు అతనికి చెప్పింది.అయినప్పటికీ, డోవ్సన్ తన బాధితుడికి 100 రోజులలో, రోజుకు నాలుగు మెసేజ్ ల నుంచి వేల మెసేజ్‌ల వరకు పంపుతూ వచ్చింది.
తనను మరోసారి గర్భవతిని చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఫిబ్రవరి 2016లో, బాధితుడు డోవ్‌సన్‌తో తన రిలేషన్ కు బ్రేకప్ చెప్పేశాడు. నవంబర్ 2016 లో ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఇది కూడా బాస్టిన్ తండ్రి అంటూ మళ్లీ ఇద్దరూ నమ్మించే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 2016లో తన పిల్లల పోషణ కోసం అతడి నుంచి మళ్లీ డబ్బులను అడగడం మొదలుపెట్టింది. డీఎన్ఎ పరీక్షను మార్చేసింది. అది డోవ్సన్ పంపినట్లు తరువాత తేలింది.