అక్రమ సంబంధం బయటపడటంతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ

అక్రమ సంబంధం బయటపడటంతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ

Updated On : February 5, 2021 / 2:46 PM IST

married woman commits suicide after husband sees extra marital affair with a boy in dindugul : తమిళనాడులోని దిండిగల్ జిల్లా వేల్ చందూర్ పక్కన ఉన్న కుజలియం పట్టికి చెందిన వేలు మురుగన్ కు భార్య ధనలక్ష్మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. మురుగన్ కరూర్ లోని ఒక టెక్స్ టైల్ ఎక్స్ పోర్ట్ పరిశ్రమలో టైలర్ గా పని చేస్తూ ఉండేవాడు. రోజు కరూర్ వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సరికి రాత్రి బాగా పొద్దుపోయేది.

ఈక్రమంలో ధనలక్ష్మికి ఊళ్లోని రమేష్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. చివరికి ఇది ఎలా మారిందంటే వేల్ మురుగన్ కరూర్ వెళ్లటం,రమేష్ ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లేంతగా బంధం మారిపోయింది. మళ్లీ రాత్రి వేలు మురుగన్ వచ్చే సరికి రమేష్ ధనలక్ష్మి ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు. వీరిబాగోతం చాలాకాలం బాగానే సాగింది.

ఒకరోజు అనుకోకుండా ..వేల్ మురుగన్ రోజు కంటే కొంచెం ముందుగానే ఇంటికి వచ్చేశాడు. అప్పటికి రమేష్ ధనలక్ష్మితో సరసాలాడుతున్నాడు. భర్త రావటంతోటే రమేష్ ను ధనలక్ష్మి  మంచం కింద దాక్కోమని చెప్పింది. వెళ్లి  తలుపు తీసింది.

అలిసిపోయి వచ్చిన భర్త బెడ్ రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకునే క్రమంలో ప్యాంట్ విప్పేందుకు ముందుకు వంగాడు. అలా వంగినప్పుడు మంచం కింద దాక్కుని పడుకుని ఉన్నరమేష్ కనపడ్డాడు. రాత్రి సమయంలో తన బెడ రూంలో పరాయి వ్యక్తిని చూసి షాక్ కు గురైన వేల్ మురుగన్ కోపంతో భార్య చేసే  పని గ్రహించాడు. కోపంతో భార్యను, రమేష్ ను చితక్కొట్టాడు.

రమేష్ అక్కడి నుంచి పారిపోయి కుజిలియంపట్టి పోలీసు స్టేషన్ కు వెళ్లి వేల్ మురుగన్ మీద ఫిర్యాదు చేయటానికి వెళ్ళాడు.  కేసు వివరాలు తెలుసుకున్న స్టేషన్ రైటర్ ఇంత అర్ధరాత్రివేళ ఎందుకు రేపు ఉదయం వచ్చి ఫిర్యాదు చేయమన్నాడు.

మర్నాడు ఉదయం వేల్ మురుగన్ తన అత్తమామలను ఇంటికి పిలిచి జరిగిన భాగోతం అంతా వాళ్లకు వివరించాడు. వారు కూతురుని మందలించారు. అందరూ హాలులో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా లోపలికి వెళ్ళిన ధనలక్ష్మి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించింది.

వేలు మురుగున్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన అక్రమ సంబంధం విషయం ఇంట్లో తల్లి తండ్రులకు తెలిసిపోవటం వారుమందలించటంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.