Married Woman Ends her life : భర్త గుడికి తీసుకు వెళ్లలేదని….

కూతురు పుట్టిన రోజు నాడు కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్దాం అని కోరింది ఓ ఇల్లాలు. భర్త అందుకు అంగీకరించలేదు. మనస్తాపానికి గురై ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది.

Married Woman Ends her life : భర్త గుడికి తీసుకు వెళ్లలేదని….

Marrid Woman End Life

Updated On : May 3, 2021 / 3:54 PM IST

Married woman ends her life : కూతురు పుట్టిన రోజు నాడు కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్దాం అని కోరింది ఓ ఇల్లాలు. భర్త అందుకు అంగీకరించలేదు. మనస్తాపానికి గురై ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బలుసు మూజి ఎస్టీ కాలనీకి చెందిన దొడ్డా సురేష్ భార్య సత్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.

ఏప్రిల్ 28వ తేదీన వారి కూతురు పుట్టిన రోజు సందర్భంగా అందరినీ గుడికి తీసుకువెళ్లమని సత్య భర్తను కోరింది. సురేష్ అందుకు అంగీకరించలేదు. మనస్తాపానిక గురైన ఇల్లాలు ఇంట్లో ఫ్యాను కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.

భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపప్తు చేస్తున్నారు. తెలిపారు. కాగా.. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్న విషయానికే ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం బంధువులను సైతం కలవరపెడుతోంది.