గంట టైం చాలు : భర్త లేని సమయం చూసి ప్రియుడితో రాసలీలలు

కరోనా లాక్ డౌన్ చాలామంది ఇళ్లల్లో గొడవలు సృష్టిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు గృహ హింస కేసులు పెరిగాయని కొన్ని లెక్కలు చెపుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఉండే వివాహేతర సంబంధాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఇలాంటి వివాహేతర సంబంధం ఇప్పుడు బయటపడి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
భర్త ఇంట్లో లేని టైమ్ చూసుకుని ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని అతడితో రాసలీలలు సాగించింది ఓ ఇల్లాలు. ప్రియుడితో కలిసి బెడ్ రూంలో ఉండంగా ప్రియుడి తాలూకా బంధువులు దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆ వివాహితను చితక బాదారు. బాధిత మహిళ అడ్డుగుట్ట పోలీసు స్టేషన్ లో దాడి చేసినవారిపై ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే ….. సికింద్రాబాద్ అడ్డగుట్టలో నివాసం ఉండే మహిళ స్ధానికంగా ఉండే ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలా కాలంగా భర్తకు తెలియకుండా, భర్త ఇంటిలేని సమయంలో ఆ యువకుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో మునిగి తేలుతూ ఉండేది. గుట్టుగా ఆ యువకుడితో ఆమె చాలాకాలం శృంగార కలాపాలు సాగించింది.
దేశవ్యాప్తంగా గత కొద్దికాలంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ఆమె భర్త కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో వారి శృంగారానికి బ్రేక పడింది. ప్రియుడి ఎడబాటును ఆమె తట్టుకోలేకపోయింది. ఆదివారం, ఏప్రిల్ 19 రాత్రి ఆమె భర్త పనిమీద బయటకు వెళ్లగా వెంటనే ప్రియుడ్ని ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. పోన్ వచ్చినంత స్పీడ్ గానే ఆమె ఇంటికి చేరుకున్న ప్రియుడితో కలిసి ఆమె బెడ్ రూంలోకి చేరుకుంది.
గత కొద్ది రోజుల విరహ తాపాన్ని ఆగలేక శృంగారంలో మునిగి తేలారు. ఇది గమనించిన ప్రియుడి బంధువులు ఆమె ఇంటికి చేరుకుని స్ధానికుల సాయంతో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నీ వల్లే మా వాడు చెడిపోయాడని ఆమె పై దుర్భాషలాడారు.
ఆవేశం పట్టలేని కొందరు మహిళపై దాడి చేసి చితక్కొట్టారు. వారినుంచి తప్పించుకున్న మహిళ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మహిళపై తాము దాడి చేయలేదని స్ధానికులు పేర్కోన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎల్లప్ప చెప్పారు.