Fire Accident In Prison : జైలులో భారీ అగ్నిప్రమాదం

ఇరాన్‌లోని ఓ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్‌లోని ఈవిన్‌ జైలులోని ఓ భాగంలో మంటలు చెలరేగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది. జైలులోని గార్డులు, ఖైదీల మధ్య ఘర్షణ జరిగిన అనంతరం మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది.

Fire Accident In Prison : జైలులో భారీ అగ్నిప్రమాదం

massive fire accident

Updated On : October 17, 2022 / 8:24 AM IST

Fire Accident In Prison : ఇరాన్‌లోని ఓ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్‌లోని ఈవిన్‌ జైలులోని ఓ భాగంలో మంటలు చెలరేగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది. జైలులోని గార్డులు, ఖైదీల మధ్య ఘర్షణ జరిగిన అనంతరం మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కాల్పుల శబ్ధం కూడా వినిపించినట్లుగా స్థానికులు చెప్పారు.

అగ్నిప్రమాదం తర్వాత పలువురు నిరసనకారులు ఈవిన్‌ జైలు వైపు వెళ్లడం ఇరాన్ మానవ హక్కుల సంఘాలు విడుదల చేసిన వీడియోల్లో కనిపిస్తోంది. ఇరాన్ భద్రతా దళాలు, అల్లర్ల నిరోధక దళాలు జైలు సమీపంలో భారీగా మోహరించారు. ఈ జైలులో రాజకీయ ఖైదీలు ఎక్కువగా ఉన్నారు. ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న పలువురు వ్యక్తులను కూడా ఇదే జైలులో ఉంచారు. ఈ జైలులో ఉన్నవారిపై ఆకృత్యాలు పెరిగిపోవడంతో అమెరికా ఈ జైలును బ్లాక్‌ లిస్టులో ఉంచింది.

China Restaurant Fire: చైనాలోని ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 17మంది మృతి

22 ఏళ్ల కుర్దిష్ యువతి మహ్సా అమిని పోలీసుల చేతిలో హత్యకు గురైన అనంతరం ఇరాన్‌లో నిరసనలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో టెహ్రాన్‌లోని జైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. గత నెల రోజులుగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో ఇప్పటి వరకు 200 మందికిపైగా ఆందోళనకారులు మృతి చెందారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిప్రమాదం తర్వాత జైలులో ఉన్నవారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.