Minor Girl Molested : దారుణం : తల్లికి, కూతురుకు ఒకే వయస్సులో లైంగికదాడి
కొన్నివార్తలు వింటుంటే ఒళ్లు గగ్గుర్పోడుస్తుంది. కొన్ని దారుణాలు ఇలా జరుగుతున్నాయేంటా అని బాధ కలుగుతుంది. తల్లికి 11 ఏళ్ల వయస్సులో జరిగిన ఘోరమే కూతురుకు 11 ఏళ్ల వయసులో జరిగిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

Minor Girl Molested
Minor Girl Molested in Chennai, Same age her Mother molested : కొన్నివార్తలు వింటుంటే ఒళ్లు గగ్గుర్పోడుస్తుంది. కొన్ని దారుణాలు ఇలా జరుగుతున్నాయేంటా అని బాధ కలుగుతుంది. తల్లికి 11 ఏళ్ల వయస్సులో జరిగిన ఘోరమే కూతురుకు 11 ఏళ్ల వయసులో జరిగిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
చెన్నై వాషర్ మెన్ పేటలో పార్ధసారధి వీధికి చెందిన ఆటో డ్రైవర్ రాజా (36) అదే ప్రాంతానికి చెందిన ఇంద్రాణి(45) అనే ఒంటరి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచుగా ఇంద్రాణి ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఆక్రమంలో ఇంద్రాణికి తెలియకుండా, ఇంట్లో ఉన్న ఆమె 11 ఏళ్ల మనవరాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు.
గతేడాది నవంబర్ లో ఇంద్రాణి మరణించింది. ఒంటరిగా ఉన్న ఆమె మనవరాలు రెడ్ హిల్స్ లో ఉన్న తల్లి వద్దకు వెళ్ళిపోయింది. ఇంద్రాణి కూతురు, తన కూతుర్ని వేరే తన స్నేహితురాలి వద్ద ఉంచి పెంచసాగింది. కాలక్రమంలో బాలిక కడుపు పెద్దవటం గమనించిన ఆఇంటి యజమానురాలు బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపించింది. స్కానింగ్ తీయగా బాలిక గర్భవతి అని తెలిసింది.
ఈ విషయాన్ని తన స్నేహితురాలైన బాలిక తల్లికి చెప్పింది. షాక్ కు గురైన బాలిక తల్లి వెంటనే వచ్చి వివరాలు తెలుసుకుంది. బాలికపై లైంగిక దాడి చేసిన ఆటోడ్రైవర్ రాజాపై వాషర్ మెన్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం రాజాను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసు విచారణలో బాలిక తల్లి 11 ఏళ్ళ వయస్సులో ఉండగా లైంగిక దాడికి గురై బాలికకు జన్మనిచ్చింది. తదనంతరకాలంలో బిడ్డను తల్లి ఇంద్రాణికి అప్పగించి వేరే వ్యక్తిని వావాహం చేసుకుని రెడ్ హిల్స్ ఏరియాలో నివసించసాగింది.
కాగా…. బాలిక తల్లిపై జరిగిన లైంగిక దాడి కేసు ఇంకా మాధవరం పోలీసు స్టేషన్ లో పెండింగ్ లో ఉంది. తల్లికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగకుండానే ఆమె కుమార్తెపైన కూడా లైంగిక దాడి జరిగి గర్భవతి కావటం గమనార్హం.