Extra Marital Affair : అక్రమ సంబంధం తెలిసి పోయిందని కొడుకు హత్య

వివాహేతర సంబంధం తెలిసిపోయిందని ప్రియుడి సాయంతో కన్నకొడుకును హత్య చేయించిందో ఇల్లాలు.

Extra Marital Affair : అక్రమ సంబంధం తెలిసి పోయిందని కొడుకు హత్య

Extra Marital Affair

Updated On : September 17, 2021 / 5:26 PM IST

Extra Marital Affair : వివాహేతర సంబంధం తెలిసిపోయిందని ప్రియుడి సాయంతో కన్నకొడుకును హత్య చేయించిందో ఇల్లాలు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడువరంపాక్కంకి చెందిన సెల్వం, దుర్గ భార్యా భర్తలు. వీరికి సూర్య(14)శృతి(12) సంతోష్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. దుర్గ, గోపాలకృష్ణన్(21) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈవిషయాన్ని కొడుకు సూర్య ఒకరోజు చూశాడు.

అప్పటి నుంచి ఆమెకు భయం పట్టుకుంది. ఈ విషయాన్ని తన ప్రియుడు గోపాలకృష్ణన్ కు చెప్పింది. దీంతో గోపాలకృష్ణన్, తన స్నేహితుడు అన్నామలైతో కలిసి ఈనెల 9న సూర్యను బయటకు తీసుకు వెళ్లి హత్యచేశారు.  సూర్య  కనపడక పోవటంతో  తాత చోళవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గోపాలకృష్ణన్ సూర్యను తీసుకు వెళ్లినట్లు తెలుసుకుని అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయం మొత్తం చెప్పాడు. విచారణలో గోపాలకృష్ణన్, దుర్గల అక్రమ సంబంధం వెలుగు చూసింది. సూర్య తల్లి దుర్గ, గోపాలకృష్ణన్ ఏకాంతంగా ఉన్నప్పుడు సూర్య  చూశాడనే కారణంతోనే ఈ హత్య చేసినట్లు వెల్లడైంది.