ఇలాంటి కూతురు వద్దు : తల్లిని ప్రియుడితో కలిసి చంపి.. 3 రోజులు ఇంట్లోనే..

ఇలాంటి కూతురు వద్దు : తల్లిని ప్రియుడితో కలిసి చంపి.. 3 రోజులు ఇంట్లోనే..

Updated On : October 28, 2019 / 5:04 AM IST

కూతురి జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని భయపడి వారించిన తల్లిని కూతురే మట్టుబెట్టింది. ఎవరో ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ తల్లి ఊరకుండిపోయేదేమో.. ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందనే విషయం తెలిసి ఆగ్రహానికి గురైంది. అది సరైంది కాదంటూ కూతురు కీర్తిని మందలించింది. 

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నిర్నాముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి కుటుంబం బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ సిటీకి వచ్చింది. శ్రీనివాసరెడ్డి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల కూతురి ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లి మందలించింది.  

ఈ క్రమంలో ఎలాగైనా తల్లిని తప్పించాలనుకుని వ్యూహం రచించి హత్య చేసింది. మొదటి బాయ్ ఫ్రెండ్ సాయంతో హత్య చేసి మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంది. మృత దేహం దుర్వాసన వస్తుండటంతో రామన్నపేట సమీపంలోని రైల్వే పట్టాలపై పడేశారు. 

ఆ తర్వాత తండ్రికి ఫోన్ చేసి 15రోజుల పాటు వైజాగ్ టూర్ వెళ్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఇంటికి సమీపంలో ఉన్న మరో బాయ్ ఫ్రెండ్ ఇంట్లో గడిపింది. లారీ డ్రైవర్ గా పనిచేసే తండ్రి శ్రీనివాసరెడ్డి డ్యూటీ నుంచి వచ్చాక అనుమానం వచ్చి ప్రశ్నించడంతో తెలీదంటూ బుకాయించింది. 

అనుమానంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. తన తల్లి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తండ్రి తాగి రావడంతో తరచూ పేరెంట్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని పోలీసుకు చెప్పింది. స్టైల్ మార్చి ఎంక్వైరీ మొదలుపెట్టేసరికి అసలు విషయం బయటపెట్టింది. 

పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో సహకరించిన తొలి బాయ్ ఫ్రెండ్ పరారీలో ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.