రూ.20లక్షల ఉల్లిపాయలు చోరీ

రూ.20లక్షల ఉల్లిపాయలు చోరీ

Updated On : November 29, 2019 / 3:56 AM IST

బంగారు నగలో, లక్షల్లో డబ్బులో కాజేయలేదు. రూ. 20లక్షలు విలువ చేసే ఉల్లిపాయలు దోచుకెళ్లారు. మహరాష్ట్రలోని నాసిక్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‍కు వెళ్తున్న ట్రక్‌లో ఉల్లిపాయలు మాయమయ్యాయి. నాసిక్‌కు చెందిన ప్రేమ్ చంద్ శుక్లా శివపురికి చెందిన డ్రైవర్ జావేద్‌తో ఉల్లిపాయల లారీ లోడ్ ను పంపాడు. అనుకున్న సమయానికి లోడ్ గమ్యస్థానానికి చేరకపోవడంతో శివపురికి వెళ్లి అడిగాడు. 

ఈ మేర శివపురి పోలీస్ స్టేషన్ కు వెళ్లి రూ.20లక్షల ఉల్లిపాయలు దొంగతనానికి గురయ్యాయని ప్రేమ్ చంద్ శుక్లా పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఎస్పీ రాజేశ్ సింగ్ చండేల్..  ఉల్లిపాయల లోడ్ నవంబరు 22 నాటికి గోరఖ్‌పూర్ వెళ్లాల్సి ఉందని, డ్రైవర్ కూడా కనిపించడం లేదని తెలిపాడు. 

ఈ మేర దర్యాప్తు చేపట్టిన పోలీసులకు లారీ దొరికింది. అందులో ఉల్లిపాయలు కనిపించలేదు. లోడ్ తో సహా వెళ్లిపోయి అమ్మేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.