మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం : వంద కోట్లు వసూలు

హైదరాబాద్ నాగోల్ లో మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం బయటపడింది.

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 03:51 PM IST
మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం : వంద కోట్లు వసూలు

హైదరాబాద్ నాగోల్ లో మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం బయటపడింది.

హైదరాబాద్ : నాగోల్ లో మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం బయటపడింది. గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. లక్షల రూపాయలు కడితే పల్లీల నుంచే నూనే తీసే యంత్రాన్ని ఇస్తామంటూ దగా చేశారు. నెలకు పది వేలు సంపాదించవచ్చంటూ గ్రీన్ గోల్డ్ సంస్థ ఎండీ శ్రీకాంత్ అమాయకులకు ఆశా చూపారు. వేలాది మంది నుంచి వంద కోట్ల వరకు వసూలు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు శ్రీకాంత్ ను అరెస్టు చేసి, విచారిస్తున్నారు. అధికారులు అతనికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి భారీ స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి.