Mumbai : చాక్లెట్ బాక్సుల్లో అత్యంత విషపూరితమైన పాములు.. వీటి విషం కోసం అక్రమ తరలింపు

అత్యంత విషపూరితమైన పాముల్ని బిస్కెట్లు, చాక్లెట్ బాక్సుల్లో దాచి తరలిస్తున్నారు. వాటి విషానికి అంతర్జాతీయ మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. దీంతో వాటిని అక్రమంగా తరలిస్తున్నారు.

Mumbai : చాక్లెట్ బాక్సుల్లో అత్యంత విషపూరితమైన పాములు.. వీటి విషం కోసం అక్రమ తరలింపు

Updated On : December 23, 2023 / 11:18 AM IST

Chhatrapati Shivaji Maharaj International Airport : అవి అత్యంత విషపూరితమైన పాములు. వాటిని బిస్కెట్లు, చాక్లెట్ బాక్సుల్లో దాచి తరలిస్తున్నారు. ఎందుకంటే వాటి విషానికి అంతర్జాతీయ మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. దీంతో స్మగ్లర్స్ చాక్లెట్ బాక్సుల్లో దాచి అక్రమంగా తరలిస్తున్న పాములను ముంబై ఎయిర్ పోర్టులో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ పాములు బాల్ పైథాన్ జాతికి చెందినవి. ఇవి అత్యంత విషపూరితమైనవే అయినా చూడటానికి చాలా అందంగా ఉంటాయి. తెల్లటి రంగులో శ్వేత నాగుల్ని తలిపించే అందం ఈ పాముల సొంతం. వీటిలో రకరకాల రంగులు ఉంటాయి. కొన్ని పాములు తెల్లటి రంగులో ఉంటే మరికొన్ని..తెలుపు రంగుమీద పసుపు పచ్చని డిజైన్ తో ఉంటాయి. ఇంకొన్ని తెలుపున లుపు రంగు డిజైన్ తో ఉంటాయి.

బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన ప్రయాణీకుడి పాముల్ని అక్రమంగా తరలిస్తున్నాడని ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో డీఆర్ఐ, ముంబై జోనల్ యూనిట్ అధికారులు డిసెంబర్ 21న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు వచ్చారు. సదరు ప్రయాణీకుడి లగేజ్ ను తనిఖీలు చేయగా బిస్కెట్లు, చాక్లెట్ల బాక్సుల్లో ఈ పాముల్ని దాచిపెట్టి..తరలిస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తం తొమ్మిది పాముల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.