గాజుల కోసం గొడవ.. తల్లీ ఆత్మహత్య, కూతురి పరిస్థితి విషమం

గాజుల పెట్టె కోసం తల్లీ కూతుళ్ల మధ్య జరిగిన గొడవలో తల్లి ప్రాణాలు కోల్పోగా, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ముంబైలోని లోఖాండ్వాలా మార్కెట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార.. సాధారణ గాజులే అయినా తల్లీ కూతురు తనకే కావాలంటూ గాజుల పెట్టె కోసం గొడవపడ్డారు.
ఆవేశంలో కూతురు (ప్రియా) కుటుంబ సభ్యుల ముందే ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమై దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో చికిత్స కోసం చేర్పించారు. ఇంటికి తిరిగొచ్చేసరికి ఇంట్లో 52ఏళ్ల శశి(తల్లి) కనిపించలేదు. ఇంటి చుట్టుపక్కన వెదికినా కనిపించలేదు. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్‌లో శవమై కనిపించింది.
కూతురు ఇలా చేసుకోవడానికి కారణం తనేనని భావించి అవమానంతో తల్లి బిల్డింగ్ పైనుంచి దూకేసినట్లు భావిస్తున్నారు. యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.