ఐఆర్ఎస్ అధికారి రాసలీలలు….రెండేళ్లుగా మహిళతో ఎఫైర్

పెళ్లానికి విడాకులిచ్చానని…నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళను రెండేళ్లుగా శారీరకంగా అనుభవించి మోసం చేసిన ఐఆర్ఎస్ అధికారి ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఒక ఐఆర్ఎస్ అధికారి రెండేళ్లుగా తనను శారీరకంగా లోబరుచుకుని, పెళ్ళి చేసుకుంటానని మోసం చేశాడని ఆ మహిళ ముంబైలోని ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రెండేళ్ల కిందట డిప్యూటీ కమీషనర్ స్ధాయిలో పని చేస్తున్న అధికారిని ఆయన ఆఫీసులో కలిశానని…అప్పుడు తన ఫోన్ నెంబరు అడిగి తీసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కోంది. ఆ తర్వాత తరచూ ఆ అధికారి ఫోన్ చేస్తూ ఉండేవాడని..దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగిందని తెలిపింది.
తాను భార్యకు విడాకులిచ్చానని…. తనను రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శృంగారంలో పాల్గోన్నాడని ఆమె ఆరోపించింది. ఒంటరిగా ఖర్గర్ లో జీవిస్తున్నానని చెప్పి తనను రెండేళ్లుగా లైంగికంగా దోచుకున్నాడని….శారీరకంగా సుఖాలు అనుభవించి ఇప్పడు మొహం చాటేసాడని ఆ మహిళ వాపోయింది.
ఖర్గర్ లో నివసిస్తున్నాడని తెలిసి అక్కడకు వెళ్లి ఆరాతీయగా భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నట్లు బాధితురాలు వివరించింది. ఈవిషయమై జూన్ 12న ఆఫీసుకువెళ్లి ఆ అధికారిని ప్రశ్నించగా…విడాకుల ప్రక్రియ జరుగుతోందని త్వరలోనే వచ్చేస్తాయని… ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాడని తెలిపింది.
అప్పటి నుంచి ఆయన తన ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని ….ఈ విషయమై ఆఫీసుకు వెళ్లి అడగ్గా డబ్బులు ఇస్తానంటూ బేరాలు మొదలెట్టాడని ఆమె ఆరోపించింది. తనను రెండేళ్లగా లైంగిక లోబరుచుకుని శారీరక సుఖాలు అనుభవించి మోసం చేసిన అధికారిని శిక్షించాలని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376,377 కిందే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read: హిజ్రాతో ప్రేమ,సహజీవనం..అంతలోనే ఇద్దరూ ఆత్మహత్య