Mumbai Nirbhaya : అత్యాచారం చేసి రాడ్ చొప్పించి.. ముంబైలో నిర్భయ తరహా దారుణం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై పాశవికంగా అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆ తర్వాత శారీరకంగా చిత్రవధకు గురిచేశారు. అత్యాచారం..

Mumbai Nirbhaya
Mumbai Nirbhaya : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై పాశవికంగా అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆ తర్వాత శారీరకంగా చిత్రవధకు గురిచేశారు. అత్యాచారం చేశాక పారిపోవడానికి ముందు ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి రాక్షసానందం పొందారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. నగరంలోని సకినాక ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మరో ‘నిర్భయ’ను తలపించింది. 32 ఏళ్ల బాధిత మహిళపై దారుణానికి తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Medchal : అక్రమ సంబంధం.. ప్రియురాలిని భూమిలో పాతిపెట్టిన ప్రియుడు
సకినాక ప్రాంతంలోని ఖైరాని రోడ్డులో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుర్తు తెలియని మహిళ రక్తపు మడుగులో పడి ఉందని తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కంట్రోల్ రూముకు ఫోన్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళను ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తరలించామన్నారు.
Man Attack : వీర్యం నింపిన సిరంజీతో మహిళలపై దాడి చేసిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోతోంది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆడపిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.