YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జరిగిన విచారణలో కోర్టు సీరియస్ అయింది.

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

YS Viveka case

Updated On : April 24, 2023 / 7:19 PM IST

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్ ను నాంపల్లి సీబీఐ కోర్టు పొడిగించింది. వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ కస్టడీ ముగియడంతో నాంపల్లి సీబీఐ కోర్టులో వారిని హాజరు పరిచింది. భాస్కర్ రెడ్డి రిమాండ్ ఏప్రిల్ 29వ తేదీ వరకు, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ ఏప్రిల్ 26వ తేదీ వరు పొడిగించింది.

దీంతో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జరిగిన విచారణలో కోర్టు సీరియస్ అయింది. ఈ కేసుకు సంబందించి ఎవరైతే ప్రతిబందకాలుగా ఉన్నారో వారంతా కూడా వారంతా భయపడే విధంగా కోర్టు రియాక్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు జోక్యంతో విచారణంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Supreme Court : అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు

అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. వారిద్దరికీ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఐవో ఆఫీసర్ వికాస్ సింగ్ నేతృత్వంలో స్పీడ్ అప్ చేసింది. గతంలో ఐవో ఆఫీసర్ గా ఉన్న రామ్ సింగ్ మారిన తర్వాత ఇటీవలి కాలంలో ఇద్దరిని అరెస్టు చేశారు.

ఈ కేసులో సాక్షాలను తారుమారు చేశారన్న అభియోగాలతో అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అవినాశ్ రెడ్డికి సైతం 160 సీఆర్ పీసీ నోటీసులు జారీ చేశారు. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసులో సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. హైకోర్టు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది.

YS Viveka Case: వైఎస్ వివేకా కేసు విచారణలో కొత్త కోణం

హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తునకు నష్టం కలిగిస్తాయని తెలిపింది. సీబీఐ దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు రెండు నెలలు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 వరకు సీబీఐ విచారణ గడువు ఇచ్చింది. వైఎస్ వివేక హత్య కేసులో ఏప్రిల్30 వరకు సీబీఐ విచారణ గడువు ముగియనుండటంతో ఈ గడువును రెండు నెలలు పెంచింది. సీబీఐ విచారణ గడువును జూన్ 30 వరకు పొడిగించింది.