ఆయుధ చట్టం కఠినతరం : వేడుకల్లో తుపాకి పేల్చారా..ఇక చిప్పకూడే!

శుభాకార్యాలు..వేడుకఃల్లో కొంతమంది అత్యుత్సాహాం ప్రదర్శిస్తుంటారు. తుపాకులు చేతబట్టుకుని ధన్..ధన్..మంటూ ఫైరింగ్ చేస్తుంటారు. స్థానికంగా భయబ్రాంతులకు గురి చేస్తుంది. పలువురు మృతి కూడా చెందారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసుకోవడం..వారిని అరెస్టు చేయడం జరుగుతుంటాయి. వేడుకల్లో తుపాకీ పేల్చడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇలా చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష..రూ. లక్ష ఫైన్ విధించాలని భావిస్తోంది.
ఈ మేరకు ఆయుధ చట్టానికి సవరణలు చేస్తూ..ప్రభుత్వం నమూనా బిల్లును రూపొందించింది. దీనిపై నవంబర్ 18 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియచేయాలని సూచించింది. త్వరలో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేగాకుండా..ఆయుధాల అక్రమ రవాణా తయారీ, అనుమతి లేకుండా..విక్రయాలు..అనుమతి లేకుండా..వీటిని కలిగి ఉండడం వంటి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.
వీటిని కట్టడి చేసేందుకు ఆయుధాల చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. అక్రమ ఆయుధాలతో నేరాలకు పాల్పడే వారికి ప్రస్తుతం ఉన్న మూడేళ్ల కనీస జైలు శిక్షను..నేర తీవ్రతను బట్టి ఏడేళ్ల నుంచి జీవిత ఖైదుగా మార్చాలని యోచిస్తోంది.
Read More : విమానం టాయిలెట్‌లో 5.6 కిలోల బంగారం