సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రోహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్

హైదరాబాద్ లో ఆపిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని రోహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండా పోయిన రోహిత..

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 07:08 AM IST
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రోహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్

Updated On : January 6, 2020 / 7:08 AM IST

హైదరాబాద్ లో ఆపిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని రోహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండా పోయిన రోహిత..

హైదరాబాద్ లో ఆపిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని రోహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండా పోయిన రోహిత.. అనూహ్యంగా సికింద్రాబాద్ లో కనిపించింది. రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ లోని ప్యాట్నీ సెంటర్ దగ్గర ఆమె నడుచుకూంటూ వెళ్తూ కనపడింది. సీసీటీవీ ఫుటేజ్ లో రోహితను పోలీసులు గుర్తించారు. ఆమె బ్లాక్ డ్రెస్ లో ఉంది. భుజాన బ్యాగ్ ఉంది. చున్నీతో ముఖాన్ని కవర్ చేసింది. ఈ ఫుటేజీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఈ ఫుటేజీ కీలకంగా మారింది. రోహిత అక్కడ ఏం చేస్తోంది? ఎటు వైపు నుంచి ఎక్కడికి వెళ్లింది? అనేది మిస్టరీగా మారింది.

గచ్చిబౌలిలోని ఆపిల్ కంపెనీలో 34ఏళ్ల రోహిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జాబ్ చేస్తోంది. నానక్ రామ్ గూడలో ప్లాట్ లో నివాసం ఉంటోంది. 2019 డిసెంబర్ 26న మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు విప్రో సర్కిల్ దగ్గర ఆటో ఎక్కింది రోహిత. ఆ తర్వాత ఏం జరిగింది? ఎటు వెళ్లింది? అనేది మిస్టరీగా మారింది.

మూడు రోజుల పాటు రోహిత కోసం గాలించిన కుటుంబసభ్యులు.. డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. రోహిత ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే రోహిత తన సెల్ ఫోన్ ని ఇంట్లోనే వదిలి వెళ్లింది. దీంతో ఆమె ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సమస్యగా మారింది. 5 ప్రత్యేక బృందాలు రోహిత కోసం గాలిస్తున్నాయి. ఇంతలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

సడెన్ గా సికింద్రాబాద్ లో రోహిత కనిపించింది. ప్రస్తుతం ఆ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. భర్త రోహిత్ తో విభేదాల కారణంగా రోహిత ఒంటరిగా జీవిస్తోందని పోలీసుల విచారణలో తెలిసింది. అసలు రోహిత ఎక్కడికి వెళ్లింది? ఎందుకు వెళ్లిపోయింది? కావాలనే వెళ్లిందా? ఉద్దేశపూర్వకంగానే కుటుంబసభ్యులకు దొరక్కుండా తిరుగుతోందా? స్నేహితులు ఎవరైనా ట్రాప్ చేశారా? ఫోన్ ఇంట్లోనే ఎందుకు వదిలేసింది? సికింద్రాబాద్ లో ఏం పని? ఈ ప్రశ్నలు మిస్టరీగా మారాయి. పలు కోణాల్లో గచ్చిబౌలి పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. త్వరలోనే మిస్సింగ్ మిస్టరీ చేధిస్తామని, రోహిత ఆచూకీ కనిపెడతామని పోలీసులు తెలిపారు.