Sonali Phogat Death Case : సోనాలి ఫొగట్ హత్య కేసులో కొత్త ట్విస్టులు..ఫామ్‌హౌస్‌లో ఖరీదైన కార్లు, ఫర్నిచర్ మాయం

బీజేపీ నేత సోనాలి ఫొగట్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. హర్యానాలోని ఆమె ఫామ్‌హౌస్‌లో పార్క్ చేసిన ఖరీదైన కార్లు, ఫర్నిచర్ మాయమైంది. సోనాలి హత్యపై దర్యాప్తు చేస్తున్న గోవా పోలీసులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేయగా... ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Sonali Phogat Death Case : సోనాలి ఫొగట్ హత్య కేసులో కొత్త ట్విస్టులు..ఫామ్‌హౌస్‌లో ఖరీదైన కార్లు, ఫర్నిచర్ మాయం

Sonali Phogat

Updated On : September 6, 2022 / 4:23 PM IST

Sonali Phogat Death Case : బీజేపీ నేత సోనాలి ఫొగట్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. హర్యానాలోని ఆమె ఫామ్‌హౌస్‌లో పార్క్ చేసిన ఖరీదైన కార్లు, ఫర్నిచర్ మాయమైంది. సోనాలి హత్యపై దర్యాప్తు చేస్తున్న గోవా పోలీసులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేయగా… ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫొగట్ హత్య కేసు నిందితుడు సుధీర్ సంగ్వాన్ ఆమె ఆస్తి, సంపదపై కన్నేసినట్టు పోలీసులు తెలిపారు. సోనాలి హత్య కేసు నిందితుడు సంగ్వాన్ ఆమె ఆస్తిని కాజేయాలని అనుకోవడమే కాకుండా ఫామ్ హౌస్‌ను 20 ఏళ్ల లీజుపై సొంతం చేసుకోవాలని స్కెచ్‌ వేశాడు.

సోనాలి ఫామ్‌హౌస్ నుంచి మాయమైన వాటిలో మహీంద్రా స్కార్పియో సహా మూడు కార్లు ఉన్నట్ల తెలుస్తోంది. కాగా, సోనాలి ఫామ్‌హౌస్ ధర స్థలంతో కలిపి దాదాపు 110 కోట్లు ఉంటుందని టాక్‌ నడుస్తోంది. ఫామ్‌హౌస్‌ను సంగ్వాన్ 20 ఏళ్ల లీజుకు తీసుకొని.. లీజు పేమెంట్‌ కింద ఏడాదికి 60 వేలు చెల్లించేలా ఒప్పందం రాసుకోవాలని భావించినట్లు పోలీసులు తెలిపారు.

Sonali Phogat Death Case : గుండెపోటుతో చనిపోలేదు.. నటి సోనాలి ఫోగట్ మృతి కేసులో ట్విస్ట్ ఇచ్చిన గోవా పోలీసులు

సోనాలిది హత్య అని తేలిన తర్వాత గోవా పోలీసులు సంగ్వాన్‌ను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో స్పీడ్ పెంచారు. నోయిడాలో తన భార్యతో కలిసి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్టు పోలీసులకు చెప్పిన సంగ్వాన్.. ఆ అపార్ట్‌మెంట్ రెంటల్ అగ్రిమెంట్‌లో సోనాలి ఫొగట్‌ను తన భార్యగా ఫొగట్ పేర్కొన్నాడు.