Newly Married Woman Missing : పెళ్లైన 10 రోజులకే పెళ్లి కూతురు ఆదృశ్యం

పెళ్లైన 10 రోజులకే పెళ్లి కూతురు ఆదృశ్యమైన  ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

Newly Married Woman Missing : పెళ్లైన 10 రోజులకే పెళ్లి కూతురు ఆదృశ్యం

Newly Married Bride Missing

Updated On : October 27, 2021 / 1:50 PM IST

Newly Married Woman Missing : పెళ్లైన 10 రోజులకే పెళ్లి కూతురు ఆదృశ్యమైన  ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన మాధవి అనే యువతికి ఈనెల 10 వ తేదీన అనంతపురం జిల్లా యాడికి మండలం పిన్నేపల్లి గ్రామానికి చెందిన కొత్తరాయుడితో వివాహం అయ్యింది.

వివాహ సాంప్రదాయాల్లో తిరిగింపు, మరిగింపుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 19వ తేదీన నూతన దంపతులిద్దరూ   చిన్నమల్కాపురం వచ్చారు. అదే రోజు భర్తకు అన్నం వడ్డించి పక్కనే ఉన్న అంగడికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మాధవి ఇంటికి తిరిగి రాలేదు.

Also Read : Gold Biscuits Donation : తిరుమల శ్రీవారికి 3.604 కేజీల బంగారం బిస్కెట్లు విరాళం

అప్పటి నుంచి బంధువుల ఇళ్లలో, తెలిసిన వారి ఇళ్ళలో  వెతికినా ఆమె ఆచూకి ఎక్కడా  లభించలేదు.  దీంతో మంగళవారం ఆమె భర్త  కొత్తరాయుడు పోలీసులకు పిర్యాదు చేశాడు.  మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.