Hyderabad: నీలోఫర్‌లో కిడ్నాపైన పాప సేఫ్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు, అంతలోనే అక్క కూతురు 18 నెలల పాప అపహరణకు గురైందని పాప చిన్నమ్మ తెలిపింది. వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు, వారు వెంటనే...

Niloufer Child Kidnap Case
Niloufer Child Kidnap Case : నీలోఫర్ ఆసుపత్రి వద్ద కిడ్నాప్ కు గురైన పాపను సేఫ్ చేశారు. పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ ను సుఖాంతం చేశారు. కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా బొబ్బిలిగం గ్రామానికి చెందిన మాధవి గర్భిణీ కావడంతో రెగ్యులర్ చెకప్ కోసం నీలోఫర్ ఆసుపత్రికి తన 18 నెలల కూతురు యూవీకతో కలిసి వచ్చింది. చెకప్ చేయించుకున్న అనంతరం రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్లి వచ్చేసరికి తన 18 నెలల కూతురు కనిపించలేదు. వెంటనే నాంపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించారు. గంటల వ్యవధిలోనే అత్తాపూర్ సమీపంలో కోమటి కుంట కల్లు కాంపౌండ్ వద్ద మహిళను అదుపులోకి తీసుకొని, పాపను సేఫ్ గా తల్లి వద్దకు చేర్చారు.
Read More : Cerebral Palsy : చిన్నారుల పాలిట శాపం…సెలెబ్రల్ పాల్సీ వ్యాధి..
నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు, అంతలోనే అక్క కూతురు 18 నెలల పాప అపహరణకు గురైందని పాప చిన్నమ్మ తెలిపింది. వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు, వారు వెంటనే స్పందించి ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ చూశారన్నారు. అనుమానిత మహిళను పట్టుకున్నట్లు, అయితే నిందితురాలైన మహిళ ఎవరనేది తమకు తెలియదన్నారు. సీసీటీవీ ఫుటేజీ తాము కూడా చూసినట్లు, నిందితురాలు నీలోఫర్ ఆసుపత్రి నుండి ఆటోలో మెహదీపట్నంకు వెళ్లినట్లు గుర్తించామన్నారు. ఆపై హైదర్‌షా కోటలోని కల్లు కాంపౌండ్‌కు చేరుకుందన్నారు. నిందితురాలనీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి పాపను తమకు చూపించారన్నారు. పాప సేఫ్ గా ఉందని, చాలా సంతోషంగా ఉందన్నారు. పాపను తొందరగా ట్రేస్ చేసి తమకు అప్పగించినందుకు పోలీసులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.