Nizamabad : అంబులెన్స్ లో ఆవులు సజీవ దహనం
నిజామాబాద్ జిల్లాలో ఆవుల సజీవదహనం తీవ్ర కలకలం రేపుతోంది. రోగులను తీసుకెళ్లాల్సిన అంబులెన్స్‌లో ఆవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాగుట్టు బయటపడింది.

Nzb Ambulence Fire Accident
Nizmabad : నిజామాబాద్ జిల్లాలో ఆవుల సజీవదహనం తీవ్ర కలకలం రేపుతోంది. రోగులను తీసుకెళ్లాల్సిన అంబులెన్స్‌లో ఆవులను అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టు బయటపడింది. అయితే ప్రమాదవశాత్తు అంబులెన్స్‌కు మంటలు అంటుకోవడంతో.. ఆవులన్నీ సజీవదహనమయ్యాయి. ఈ ఘటన జిల్లా మొత్తం చర్చనీయాంశంగా మారింది.
శనివారం రాత్రి అంబులెన్స్ స్టిక్కర్ ఉన్న వాహనంలో ఆవులను అక్రమంగా తరలించబోయింది ఓ ముఠా. నిర్మల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. ఇందల్వాయి వద్దకు రాగానే వాహనంలో సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కనే ఆపేసి పరారయ్యాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. అనంతరం డోర్లు ఓపెన్ చేసి చూడగా.. సుమారు 13 ఆవులు సజీవదహనమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు నిజామాబాద్ ఏసీపీ. ఆవులను అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
అంబులెన్స్‌ను, చనిపోయిన ఆవులను ఖాళీ ప్రదేశానికి తరలించారు పోలీసులు. వెటర్నరీ వైద్యులు ఆవులకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అటు ఆవుల అక్రమ రవాణాకు పాల్పడింది ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంబులెన్స్ రిజిస్ట్రేషన్, టోల్ ప్లాజా దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Corona : కరోనా ఫోర్త్ వేవ్ భయం-విమానాశ్రయాల్లో అలర్టైన కర్ణాటక