Corona : కరోనా ఫోర్త్ వేవ్ భయం-విమానాశ్రయాల్లో అలర్టైన కర్ణాటక

కరోనా ఫోర్త్ వేవ్ భయంతో విదేశాలనుంచి వచ్చేప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పని సరిచేశారు.

Corona : కరోనా ఫోర్త్ వేవ్ భయం-విమానాశ్రయాల్లో అలర్టైన కర్ణాటక

Bengaluru Airport

Corona :  కరోనా ఫోర్త్ వేవ్ భయంతో విదేశాలనుంచి వచ్చేప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పని సరిచేశారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారికి విమానాశ్రయంలోని ల్యాబ్ లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కోవిడ్ తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తారు. ఆస్ట్రేలియా వియత్నాం న్యూజిలాండ్ నుంచి వచ్చేవారిపై కూడా విమానాశ్రయాల్లో నిఘా పెట్టారు.
కర్ణాటకలో శనివారం కొత్తగా 126కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 76 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇద్దరు కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,785 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read : New Parking Fees : యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్ ఫీజులు.. నేటి నుంచి అమలు