NRI Husband: భార్యను దారుణంగా హత్య చేసిన ఎన్నారై భర్త

ఫారిన్ తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఎన్నారై భర్త ఒకరు దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను కర్కశంగా కడతేర్చాడు.

NRI Husband: భార్యను దారుణంగా హత్య చేసిన ఎన్నారై భర్త

NRI husband return from paris to Punjab assassinate wife

Updated On : November 1, 2023 / 12:05 PM IST

Punjab NRI Husband: ఇటలీ తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే భార్యను హతమార్చాడో ఎన్నారై భర్త. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లాలోని సంధు చాతా గ్రామంలో సోమవారం ఈ ఘాతుకం చోటు చేసుకుంది. నిందితుడు సుఖ్‌దేవ్ సింగ్‌ పరారీలో ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

కపుర్తలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) వత్సల గుప్తా మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నారై సుఖ్‌దేవ్ సింగ్‌ సోమవారం పారిస్ నుంచి సంధు చాతా గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు. అదే రోజు తన భార్య హర్‌ప్రీత్ కౌర్ (45)తో ఏదో విషయంలో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. సహనం కోల్పోయిన సుఖ్‌దేవ్.. భార్యపై దాడి చేశాడు. ఆమెను కిందపడేసి తలను బలంగా నేలకేసి బాదాడు. దీంతో హర్‌ప్రీత్ కౌర్ అక్కడికక్కడే చనిపోయిందని ఎస్ఎస్పీ తెలిపారు.

కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడు విదేశాలకు పారిపోకుండా నిఘా పెట్టినట్టు కపుర్తలా పోలీసులు వెల్లడించారు. మరోవైపు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Also Read: ముకేశ్ అంబానీకి మూడో సారి బెదిరింపు.. ఈ సారి రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్