Mahabubabad : మహబూబాబాద్‌లో క్షుద్రపూజల కలకలం

మహబూబాబాద్ లోని కాకతీయ కాలనీ‌లో క్షుద్ర పూజల కలకలం చోటు చేసుకుంది. ....ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా క్షుద్ర పూజలు చేస్తున్న స్థలంలో కోడి, కొబ్బరికాయ, నిమ్మకాయ లు.....ఇంటి ఆవరణలో

Mahabubabad : మహబూబాబాద్‌లో క్షుద్రపూజల కలకలం

occult poojas

Updated On : March 15, 2022 / 8:40 AM IST

Mahabubabad : మహబూబాబాద్ లోని కాకతీయ కాలనీ‌లో క్షుద్ర పూజల కలకలం చోటు చేసుకుంది. ….ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా క్షుద్ర పూజలు చేస్తున్న స్థలంలో కోడి, కొబ్బరికాయ, నిమ్మకాయ లు…..ఇంటి ఆవరణలో తీసిన గొయ్యిలో కొబ్బరికాయ…. తమలపాకులు, నిమ్మకాయ, స్వీటు లభ్యమయ్యాయి.

మహబూబాబాద్‌లో   కొంతకాలంగా ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తుండటంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో పూజలు చేస్తున్నారని, కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షుద్రపూజలను భగ్నం చేశారు. పూజ చేసేందుకు ఓ కోడిని, కొబ్బరికాయ,  నిమ్మకాయలు…. మరియు  హిజ్రా వేషదారణతో ఓ వ్యక్తి సిద్ధమయ్యారు. సీఐ సతీష్ తమ పోలీసుల బృందంతో రెడ్ హ్యాండడ్ గా వారిని పట్టుకుని పోలీసు స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.
Also Read : Re-registration of Vehicles : కేంద్రం భారీ షాక్-ఏప్రిల్1 నుంచి పెరగనున్న రీ-రిజిష్ట్రేషన్ చార్జీలు
వారి కారుని స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో పూజలు చేయాలని వారిని ఇంటికి పిలిపించుకున్న మహిళ తమ కుమారుడికి ఆరోగ్యం, వాహన దోషం ఉండటంతో తెలిసిన బంధువుల ద్వారా వీరిని ఇక్కడకు పిలిపించుకున్నానని…అంతే కాని క్షుద్రపూజలు చేయడం లేదని అంటుండడం విశేషం.