Woman Constable Raped : మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేసిన ఎస్సై
తుపాను కష్టకాలంలో ప్రజలకు సహాయ పడటానికి సిధ్ధంగా ఉన్న మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై అత్యాచారం చేసిన ఘటన ఒడిషా లో చోటు చేసుకుంది.

Woman Constable Raped
Woman Constable Raped : తుపాను కష్టకాలంలో ప్రజలకు సహాయ పడటానికి సిధ్ధంగా ఉన్న మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై అత్యాచారం చేసిన ఘటన ఒడిషా లో చోటు చేసుకుంది. ఇటీవల సంభవించిన యాస్ తుపాను నేపధ్యంలో … ప్రజలకు సేవలందించేందుకు ఒడిషాలోని బాలాసోర్ జిల్లా గోపాల్ పూర్ అవుట్ పోస్టు లో అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు. వారిలో ఒక మహిళా కానిస్టేబులు కూడా ఉంది.
మే 26, బుధవారం రాత్రి ఆమె విధుల్లో ఉండగా.. అక్కడే ఇన్ చార్జిగా ఉన్న ఎస్సై బన్సీధర్ ప్రధాన్ ఆమెపై అత్యాచారం చేశాడు. దీనిపై ఆమె గురువారం ఉదయం కంటాపడ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
తూర్పు రేంజ్ ఐజీ దిప్తేష్ పట్నాయక్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. నిందితుడైన ఎస్సై ప్రధాన్ ఈస్టర్న్ రేంజ్ లోని ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో ఉండగా శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు.