చేయి నరుక్కుని దాన్ని కవర్ లో పెట్టుకుని ఊరంతా తిరిగిన యువకుడు

ఒడిశాలోని గంజాం జిల్లా దిగపొహండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు చేసిన పని స్థానికులకు తీవ్రమైన భయభ్రాంతులకు గురిచేసింది. ఏం జరిగిందో ఏమోగానీ..ఓ యువకుడు తన అరచేతిని నరుక్కుని దాన్ని ఓ కవర్‌లో పెట్టుకుని ఊరంతా తిరుగుతూ స్థానికులకు కనిపించాడు.
దీంతో వారు భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సమాచారం అందిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని..అతని చేతిలో ఉన్న కవర్ తో సహా అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి చికిత్స కోసం తరించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా..బి.తురుబుడి పంచాయతీ ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే 20ఏళ్ల యువకుడు ఈ విచిత్ర ఘటనకు పాల్పడ్డాడు. శుక్రవారం (మే 22,2020) సాయంత్రం నరేంద్ర తమ ఇంటి వెనుకకు వెళ్లి..కత్తితో అరచేతిని నరుక్కుని, దానిని ఓ ప్లాసిక్ కవర్లో పెట్టుకుని గ్రామంలోని వీధుల్లో తిరిగాడు. నరేంద్ర మానసిక సమస్యలతోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత సమచారం కోసం విచారిస్తున్నారు.
Read: మనిషా, సైకోనా.. వ్యూస్ కోసం పిల్లికి ఉరేసి టిక్ టాక్, యువకుడు అరెస్ట్