రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారి
ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది.. రూ.25వేలు లంచం తీసుకుంటూ ఓ అధికారికి ఏసీబీకి అడ్డంగా దొరికి పోయాడు.

ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది.. రూ.25వేలు లంచం తీసుకుంటూ ఓ అధికారికి ఏసీబీకి అడ్డంగా దొరికి పోయాడు.
ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది.. 25వేలు లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికి పోయాడు. వెంకటరమణ అనే వ్యక్తి హైదరాబాద్ విద్యుత్ శాఖలో డీఈగా పని చేస్తున్నారు. హైదరాబాద్ లోని కొండాపూర్‌లో కొత్తగా నిర్మించిన ఓ అపార్ట్‌మెంట్‌కు ట్రాన్స్‌ఫార్మర్, ప్యానల్‌బోర్డులను మంజూరు చేసేందుకు 30 వేలు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను వెంకట రమణ డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. 25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వెంకటరమణను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.