Hyderabad : కావూరి హిల్స్ చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడి వద్దనుంచి రూ.50 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 24లక్షల 63వేలు

hyderabad arrest
Hyderabad : హైదరాబాద్ మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడి వద్దనుంచి రూ.50 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 24లక్షల 63వేలు నగదు 14తులాల బంగారు,8134 యుఎస్ డాలర్లు ఉన్నాయి.
నిందితుడు శివకుమార్‌ను చటాన్ పల్లివద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. శివకుమార్ ఆ ఇంట్లో గతంలో వాచ్ మెన్ గా పని చేసేవాడు. అక్కడ వాచ్ మెన్ గా పని చేస్తున్న సమయంలోనే అతని కుమారుడు దోపిడీకి స్కెచ్ వేశాడు.
Also Read : Mohanbabu Manchu : మోహన్ బాబు ఫ్యామిలీపై హెయిర్ డ్రెస్సర్ ఆరోపణలు
అందులో భాగంగా యజమాని ఇంట్లోలేని సమయంలో ఇంటితాళాలకు నకిలీ తాళాలు చేయించుకున్నారు. ఇంట్లో యజమాని లేని సమయంలో నకిలీ తాళంతో శివకుమార్ దొంగతనానికి పాల్పడినట్లు మాదాపూర్ డీఎస్పీ తెలిపారు.