AAP MLA పై అత్యాచారం ఆరోపణలు

  • Published By: madhu ,Published On : March 7, 2019 / 09:48 AM IST
AAP MLA పై అత్యాచారం ఆరోపణలు

Updated On : March 7, 2019 / 9:48 AM IST

ఢిల్లీలో అధికార పార్టీ ఆప్‌కు చెందిన ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. ఆయనపై రేప్ కేసు నమోదు కావడం హస్తినలో సంచలనం సృష్టిస్తోంది. తనపై రిథాల ఎమ్మెల్యే మెహిందర్ గోయల్ తనపై అత్యాచారం జరిపాడని ఓ మహిళ ముందుకొచ్చింది. ప్రశాంత్ విహార్ పీఎస్‌లో మార్చి 07వ తేదీ గురువారం ఫిర్యాదు చేసింది. పింఛన్ మంజూరు కోసం వెళ్తే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

2008లో భర్త చనిపోయాడని..దీనితో పెన్షన్ విషయంలో ఆప్ ఎమ్మెల్యే మోహిందర్‌ను కలవడం జరిగిందని ఆ మహిళ పేర్కొంది. ఇంటికి రావాలని పిలిచి అత్యాచారం జరిపాడని..ఆరోపించింది. సదరు ఎమ్మెల్యే 2019 జనవరి నెలలో మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రతిపక్షాలు ఆప్ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆప్ సీఎం కేజ్రీవాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.