పట్టుకుని లోపలేశారు : కారుపై బిన్ లాడెన్ స్టిక్కర్
కార్లపై ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు రాసుకుంటాం.. దేవుడి బొమ్మలు పెట్టుకుంటాం.. మమ్మీ,డాడీ గిఫ్ట్ అంటూ రాసుకుంటాం.. వైవిధ్యం ఎక్కువైతే వెరైటీగా రాసుకుంటాం.. వాడెవడండీ బాబూ ఏకంగా ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టుకున్నాడు.

కార్లపై ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు రాసుకుంటాం.. దేవుడి బొమ్మలు పెట్టుకుంటాం.. మమ్మీ,డాడీ గిఫ్ట్ అంటూ రాసుకుంటాం.. వైవిధ్యం ఎక్కువైతే వెరైటీగా రాసుకుంటాం.. వాడెవడండీ బాబూ ఏకంగా ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టుకున్నాడు.
కార్లపై ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు రాసుకుంటాం.. దేవుడి బొమ్మలు పెట్టుకుంటాం.. మమ్మీ,డాడీ గిఫ్ట్ అంటూ రాసుకుంటాం.. వైవిధ్యం ఎక్కువైతే వెరైటీగా రాసుకుంటాం.. వాడెవడండీ బాబూ ఏకంగా ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టుకున్నాడు. కారు వెనకాల డిక్కీపై బిన్ లాడెన్ స్టిక్కర్ తో రయ్ రయ్ మంటూ వెళ్లాడు. తెలిసీ చేశాడా.. లేదో ఏమో గానీ పోలీసులు మాత్రం పట్టుకుని లోపలేశారు. కేరళలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కొల్లాం ప్రాంతానికి చెందిన రమీజ్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రోడ్డుపై వెళ్లే వారెవరో ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ కారును ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆ కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. వారిని ప్రశ్నించగా.. తమ ఇంట్లో ఫంక్షన్ కోసం కారును అద్దెకు తీసుకున్నట్టు చెప్పారు. ఆ ముగ్గురిలో హనీఫ్ (22) అనే యువకుడు బిన్ లాడెన్ స్టిక్కర్ ను తానే అతికించినట్టు పోలీసులకు చెప్పినట్టు ఎస్ హెచ్ ఓ ఎర్విపురం పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ఆయన చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం.. బిన్ లాడెన్ ఫొటోను అతికించిన కారు యజమాని రమీజ్ గా గుర్తించారు. 2018 ఏడాదిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఆన్ లైన్ ప్లాట్ ఫాం లో కారు కొన్నాడు. కారు డ్యాక్యుమెంట్ల వివరాలు అమ్మిన వ్యక్తి పేరు మీదే ఉన్నాయి. కారు కొన్నాక రమీజ్ తన పేరు మీదకు మార్చుకోలేదు. కారు నెంబర్ ప్లేట్ కూడా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ప్లేట్ తోనే ఉంది. ఐదు నెలల క్రితమే రమీజ్ కు.. NOC వచ్చినప్పటికీ.. ఓనర్ షిప్ కోసం అతడు దరఖాస్తు చేసుకోలేదని పోలీసులు తెలిపారు.
హనీఫ్, రమీజ్ లను ప్రశ్నించిన పోలీసులు వారిద్దరిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. షరతులతో కూడిన అనుమతితో వారిని పోలీసులు వదిలిపెట్టారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీసు స్టేషన్ కు వచ్చి హాజరుకావాలని సూచించారు. ఇటీవల శ్రీలంకలో ఈస్టర్ సండే రోజున జరిగిన వరుస ఉగ్రదాడులతో ఇండియాలో కేరళ సహా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కొన్నిరోజుల క్రితమే ఇస్లామిక్ స్టేట్ సానుభూతి పరుడుని కేరళలో NIA అధికారులు అరెస్ట్ చేశారు.