బాధ భరించలేక : కొడుకుని సజీవదహనం చేసిన తల్లిదండ్రులు
వరంగల్ రూరల్ జిల్లా ముస్తాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మహేష్‌చంద్ర అనే వ్యక్తిని చేతులు కట్టేసి కుటుంబ సభ్యులే సజీవ దహనం చేశారు. మహేశ్

వరంగల్ రూరల్ జిల్లా ముస్తాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మహేష్‌చంద్ర అనే వ్యక్తిని చేతులు కట్టేసి కుటుంబ సభ్యులే సజీవ దహనం చేశారు. మహేశ్
వరంగల్ రూరల్ జిల్లా ముస్తాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మహేష్‌చంద్ర అనే వ్యక్తిని చేతులు కట్టేసి కుటుంబ సభ్యులే సజీవ దహనం చేశారు. మహేశ్ మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తుండడంతో.. నెల క్రితం భార్య అతన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో మహేష్ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. మద్యానికి డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తుండటంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం
వరంగల్ రూరల్ జిల్లాలో దామెర మండలం ముస్తాలపల్లికి చెందిన కొడారి ప్రభాకర్, వేములమ్మ దంపతుల కుమారుడు మహేష్ చంద్ర. ఇతనికి రజితతో పెళ్లి అయింది. కొడుకు, కూతురు ఉన్నారు. మహేష్‌చంద్ర వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అయితే.. తాగుడుకు బానిసైన మహేష్ చంద్ర డబ్బుల కోసం భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో విసుగుచెందిన భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లింది. భార్య లేకపోవడంతో మహేష్ తన తల్లిదండ్రులైన ప్రభాకర్, వేములమ్మను డబ్బుల కోసం వేధించసాగాడు.
నిత్యం మహేష్ వేధింపులతో విసుగు చెందిన తల్లితండ్రులు అతన్ని ఓ చెట్టుకు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మద్యం మత్తులో ఉన్న మహేష్ తప్పించుకోవడానికి వీలు లేకుండా రెండు చేతులు కట్టివేసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరిగినా స్థానికులెవరూ అడ్డుకోలేదు. కాగా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారని కూడా చూడకుండా మహేష్ వారి పట్ల దారుణంగా ప్రవర్తించేవాడని.. డబ్బుల కోసం నిరంతరం వేధిస్తుండటంతో స్థానికులెవరూ అడ్డుకోలేకపోయారని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.