Road Accident: టైరు పేలడంతో ఘోర ప్రమాదం.. 9మంది దుర్మరణం..
సమాచారం అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైరు పేలి అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోయారు. కడలూరు జిల్లా తిట్టకూరు సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది.
తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సు తిరుచిరాపల్లి నుంచి చెన్నైకు బయలుదేరింది. కాసేపటికే చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ ఎక్కి అవతలివైపున వాహనాలపైకి దూసుకెళ్లింది. బస్సు 2 కార్లును ఢీకొట్టింది. దీంతో ఘోర ప్రమాదం జరిగింది.
సమాచారం అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.