Fake Signature Fraud : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఖాతానుంచి రూ.15 లక్షలు స్వాహా చేసిన పనిమనిషి
రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి.. వ్యక్తిగత సహాయకుడిగా.. నమ్మకంగా ఉంటూ ఆయన బ్యాంకు ఖాతానుంచి రూ. 15 లక్షలు కొట్టేసిన నయ వంచుకుడి ఉదంతం కర్నాటకలో వెలుగు చూసింది.

Fake Signature Fraud
Fake Signature Fraud : రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి.. వ్యక్తిగత సహాయకుడిగా.. నమ్మకంగా ఉంటూ ఆయన బ్యాంకు ఖాతానుంచి రూ. 15 లక్షలు కొట్టేసిన నయ వంచుకుడి ఉదంతం కర్నాటకలో వెలుగు చూసింది.
కోరమంగళంలో నివాసం ఉండే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.విజయ్(84) బాగోగులు చూసుకునేందుకు ఆయన కుమారుడు ఒక ఏజెన్సీ ద్వారా గంగాగవతికి చెందిన కాశీంసాబ్ (34) ని నియమించాడు. కాశీంసాబ్ వృధ్దుడైన విజయ్‌కు అన్ని విషయాల్లోనూ సహాయకుడిగా ఉంటూ ఎంతో నమ్మకంగా ఆయన బాగోగులు చూసుకుంటున్నాడు.
ఈనెల 21న కాశీం తన సోదరుడి పెళ్లికి ఊరు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. ఈ సమయంలో విజయ్ తన బ్యాంకు ఖాతాలను పరిశీలించగా… చెక్కుల ద్వారా రూ. 14.9 లక్షల రూపాయల నగదు బదిలీ అయినట్లు గుర్తించారు.
వెంటనే కాశీం సాబ్ కు ఫోన్ చేసి మాట్లాడగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో విజయ్ కోరమంగళం పోలీసులకు కాశీంసాబ్ మీద ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.