పెట్రోలు మాఫియా: నలుగురు అరెస్టు,8 మంది పరారీ

హైదరాబాద్: కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలోని IOC/BPC పెట్రోలు కంపెనీల పైప్ లైన్ లనుంచి డీజిల్ దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోలో, డీజిల్ దొంగతనం చేస్తూ కోట్ల రూపాయల వ్యాపారంచేస్తున్న12 మంది ముఠాలోని 4గురు సభ్యులను అరెస్టు చేసారు. పరారీలో ఉన్నమరో 8 మంది కోసం గాలిస్తున్నామని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. అరెస్టు చేసిన వారి వద్దనుంచి రూ.90లక్షల 40వేల రూపాయలు నగదు,ఒక డీజిల్ ట్యాంకరు,కారు,మోటారు సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.