సినిమా కాదు : ఏం బ్యూటీరా బాబూ అని వాహనం ఆపారో దోచేస్తారు

టార్చ్ లైట్...ఇది ఓ తమిళ సినిమా. హైవేలపై దోపిడీలకు పాల్పడే ముఠా కథ ఇది. అందంగా అలకరించుకున్న ఓ అమ్మాయి చేతిలో వెలుగుతూ ఉండే ఓ టార్చ్ లైట్ పట్టుకొని రోడ్డు

  • Published By: veegamteam ,Published On : September 24, 2019 / 11:24 AM IST
సినిమా కాదు : ఏం బ్యూటీరా బాబూ అని వాహనం ఆపారో దోచేస్తారు

Updated On : September 24, 2019 / 11:24 AM IST

టార్చ్ లైట్…ఇది ఓ తమిళ సినిమా. హైవేలపై దోపిడీలకు పాల్పడే ముఠా కథ ఇది. అందంగా అలకరించుకున్న ఓ అమ్మాయి చేతిలో వెలుగుతూ ఉండే ఓ టార్చ్ లైట్ పట్టుకొని రోడ్డు

టార్చ్ లైట్…ఇది ఓ తమిళ సినిమా. హైవేలపై దోపిడీలకు పాల్పడే ముఠా కథ ఇది. అందంగా అలకరించుకున్న ఓ అమ్మాయి చేతిలో వెలుగుతూ ఉండే ఓ టార్చ్ లైట్ పట్టుకొని రోడ్డు పక్కన నవ్వుతూ కనిపిస్తుంది. ముఖ్యంగా లారీలపై టార్చ్ లైట్ వేసి డ్రైవర్లను ఆకర్షిస్తుంది. తనను చూసి రోడ్డు పక్కన లారీ ఆపిన డ్రైవర్ ను ముగ్గులోకి దింపేందుకు యత్నిస్తుంది. టార్చ్ లైట్ వెలుగు తన వంటిపై ఉంచి వయ్యారాలు ప్రదర్శిస్తుంది. అక్కడే చేతి వేళ్ళతో బేరం మాట్లాడుకుని పొదల చాటుకు తీసుకెళ్లి పని కానిస్తుంది. తమిళనాట వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. 

అసలు విషయానికి వస్తే…సేమ్‌ టూ సేమ్‌ ఇలాంటి కథే రియల్‌ లైఫ్‌లోనూ జరిగింది. ఈ కేటుగాళ్లు ఆ సినిమా చూసే రంగంలోకి దిగారో…లేక వారి బుర్రల్లోనే సొంతంగా ఆలోచన పుట్టిందో తెలియదు కానీ..రీల్‌ లైఫ్‌ సీన్స్‌ను రియల్‌ లైఫ్‌లో దించేశారు. టార్చ్ లైట్ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. ఖతర్నాక్‌ కథకు స్కెచ్చేశారు. పోలీసులే అవాక్కయ్యేలా…నలుగురూ కలిసి లూటీలకు ప్లాన్‌ వేశారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన వెంకటరమణ, శ్రీరామ్, వెంకటాద్రి, సైదాపురం మండలానికి చెందిన శరత్ కుమార్‌లు స్నేహితులు. నేరచరిత్ర కలిగిన ఈ నలుగురు ఓ ముఠాగా ఏర్పడి టార్చ్ లైట్ సినిమా తరహాలో హైవే దోపిడీలకు పాల్పడాలని పథకం వేశారు. అంతా బాగానే ఉంది…కానీ టార్చ్‌లైట్‌ వెలిగించడానికి మాత్రం అమ్మాయి లేదు. అమ్మాయి కోసం పాట్లు పడ్డారు. ఎవరూ దొరకలేదో ఏమో కానీ…ఆ నలుగురి బుర్రకు ఓ ఖతర్నాక్‌ ఆలోచన తట్టింది. ఎవరినో వెతకడం ఎందుకుని ఆ నలుగురిలోనే ఒకరికి అమ్మాయి వేషం వేశారు.

పథకం ప్రకారం…శరత్‌ కుమార్‌కు ఆడ వేషం వేశారు. ఆ తర్వాత చిత్తూరు, నెల్లూరు, కడప, చెన్నై సరిహద్దుల్లోని హైవేలను ఎంచుకున్నారు. శరత్ చీర, జాకెట్ వేసకుని, రెడీమేడ్ జడతో అమ్మాయిలా తయారవుతాడు. చీకటి పడ్డాక నలుగురూ కలిసి రంగంలోకి దిగుతారు. ఆడ వేషంలో ఉన్న శరత్.. చేతిలో టార్చ్ లైట్ పట్టుకొని రోడ్డుపక్కన నిలబడతాడు. లారీ డ్రైవర్‌లను టార్చ్ లైట్‌తో ఆకర్షిస్తాడు. ఎవరో అందమైన అమ్మాయి లిఫ్ట్‌ అడుగుతోందని భావించి లారీ డ్రైవర్‌ ఆపగానే..మాయ మాటలతో పొదల చాటుకు తీసుకెళతాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న ముగ్గురు.. డ్రైవర్‌పై దాడికి పాల్పడతారు. అందినకాడికి దోచుకుని ఉడాయిస్తారు. ఇలా ఒకే రాత్రి మూడు, నాలుగు చోట్ల దాడులు చేస్తూ వీలైనంత సంపాదిస్తారు. ఇంకేముంది పగలంతా ఆ డబ్బుతో ఎంజాయ్ చేయడం…రాత్రి కాగానే మళ్లీ రంగంలోకి దిగడం. ఇదే ఆ ముఠా పని.

చివరికి పాపం పండింది. ఓ బాధితుడి ఫిర్యాదుతో ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. హైవేలపై దారి దోపిడీలకు పాల్పడమే కాకుండా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 800గ్రాముల గంజాయి, నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక చీర, జాకెట్, టార్చిలైటు, జడను స్వాధీనం చేసుకున్నారు.