Mahabubabad Childrens Case: మహబూబాబాద్ పసి పిల్లల హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య చేసింది ఎవరో తెలిసి పోలీసులే షాక్..

దీంతో పిల్లలను ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఇద్దరిని కడతేర్చింది.

Mahabubabad Childrens Case: మహబూబాబాద్ పసి పిల్లల హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య చేసింది ఎవరో తెలిసి పోలీసులే షాక్..

Updated On : September 27, 2025 / 1:21 AM IST

Mahabubabad Childrens Case: మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన పసి పిల్లల హత్యల కేసులో బిగ్ ట్విస్ట్. పిల్లల హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. కన్న తల్లే హంతకురాలు అని తేల్చారు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే.. పిల్లలను చంపిందని తెలిసి పోలీసులు సైతం షాక్ అయ్యారు.

ముగ్గురు కన్న కొడుకుల్లో ఇప్పటికే ఇద్దరు పిల్లలను హత మార్చింది తల్లి. ఈ నెల 24న మనీశ్ (6) ని హత్య చేసింది. జనవరి 5న నిహాల్ (2)ను నీళ్ళ సంపులో పడేసి హత్య చేసింది. పిల్లల వరుస హత్యలు కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో సంచలనం సృష్టించాయి.

కన్న తల్లి శిరీషను పోలీసులు అరెస్ట్ చేశారు. 24వ తేదీన రాత్రి మనీశ్ మెడకు తాడు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపింది తల్లి శిరీష. భర్త తాగుడుకు బానిసై భార్యను, పిల్లలను పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించింది శిరీష. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారని భావించిన శిరీష.. తన ఆత్మహత్యకు ముందు పిల్లలను చంపేయాలని నిర్ణయించింది. దీంతో పిల్లలను ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఇద్దరిని కడతేర్చింది. కసాయి తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

ఒకే ఇంట్లో చిన్నారుల వరుస మరణాలు కలకలం రేపాయి. అభంశుభం తెలియని పిల్లలను ఎవరు చంపుతున్నారో ఎందుకు చంపుతున్నారో తెలియక స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే ఇంట్లో 8 నెలల క్రితం బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఉపేందర్-శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు మనీశ్ (6) కు ఉరి బిగించి తల్లే హత్య చేసింది. కాగా, 2 నెలల క్రితం ఇదే బాలుడిపై హత్యాయత్నం జరిగింది.

ఇదే ఇంట్లో జనవరిలో మనీశ్ సోదరుడు నిహాల్(4) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంటి పరిసరాల్లో ఉన్న నీళ్ల సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. నిహాల్ మరణం సాధారణ ప్రమాదం అనుకున్నారు. కట్ చేస్తే.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజం తెలిసింది. కన్న తల్లే హంతకురాలు, పిల్లలను ఆమే కడతేర్చిందని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

కన్న తల్లే పిల్లలను చంపడానికి కారణం ఇదే..

”నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష (25) ఆరేళ్ల క్రితం ఉపేందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఉపేందర్ క్యాబ్ డ్రైవర్. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. ముగ్గురు పిల్లలు పుట్టాక ఉపేందర్ తాగుడుకు బానిస అయ్యాడని, తనను పట్టించుకోవడం లేదని, పైగా వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించే వాడని, సూటిపోటి మాటలతో వేధించే వాడని శిరీష ఆవేదనకు లోనైంది. పైగా తన పిల్లలు తన దగ్గరికి రాకుండా తన అత్త మామల దగ్గరికి వెళ్లేవారని బాధ పడింది. అటు పిల్లలు, ఇటు భర్త పట్టించుకోవడం లేదని, తనను ఎవరూ ప్రేమించడం లేదని ఆత్మహత్య చేసుకోవాలని శిరీష అనుకుంది.

తాను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు అనాథలు అవుతారని భావించిన శిరీష.. వారి ముగ్గురిని చంపాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా 2025 జనవరిలో మూడో కుమారుడు మనీశ్ (2) ను నీళ్ల సంపులో పడేసి ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఈ నెల (సెప్టెంబర్) 24న మొదటి కుమారుడు మనీశ్ ను నైలాన్ తాడుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అటు భర్త, ఇటు పిల్లల ప్రేమకు నోచుకోకపోవడమే శిరీష ఈ ఘాతుకానికి ఒడిగట్టడానికి కారణం” అని పోలీసులు తెలిపారు.