police raid brothel house : బంజారా హిల్స్ లో వ్యభిచారముఠా గుట్టురట్టు

Police Raids On Brothal House
police raid brothel house and arrested 8 people at Hyderabad : హైదరాబాద్ బంజారా హిల్స్ లో జనావాసాల మధ్య గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార గృహం పై పోలీసులు దాడి చేసి ఇద్దరు సెక్స్ వర్కర్లతో పాటు నలుగురు విటులను ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఆనంద్ బంజారా కాలనీలో ఒక ఇంటిని ఉత్తరప్రదేశ్ కు చెందినమనోజ్ ప్రకాశ్ బాసి(40), రమేష్ పటేల్(24)లు కొద్దికాలం క్రితం అద్దెకు తీసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడకు యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి చెసి నలుగురు విటులు, ఇద్దరు యువతులు, ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. యువతులిద్దరినీ పునరావాసకేంద్రానికి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.