ప్రియురాలిని పెళ్లి పీటల మీదే చంపేసిన ప్రియుడు

ప్రేమ ఉన్మాదం పెళ్లి పీటల మీద ఉన్న వదువు ప్రాణాలను తీసుకుంది. తాను ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందనే కోపంతో తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో చోటుచేసుకుంది. రాయ్‌బరేలీ జిల్లాలోని గాజియాపుర్‌కు చెందిన బ్రిజేంద్ర, ఆశ గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువతి బ్రిజేంద్రకు పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్దమైంది.
Read Also : కాపురంలో ‘దున్నపొతు’ చిచ్చు.. భార్య కాళ్లను నరికేసిన భర్త
తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఆశ ఒప్పుకోగా.. పెళ్లి చేసుకుంటున్న సమయంలో సడెన్‌గా వచ్చిన పెళ్లి కూతురు ఆశపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆశ అక్కడికి అక్కడే చనిపోయింది. వెంటనే బ్రిజేంద్ర కూడా తనకుతానే తుపాకితో కాల్చుకున్నాడు. కాగా బ్రిజేంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. తుపాకితో ప్రేమోన్మాది వీరంగం సృష్టించగా అక్కడ ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు.