Bihar : ఏకంగా రైల్వే ట్రాక్‌నే చోరీ చేసిన దొంగలు.. సహకరించిన RPF సిబ్బంది

బీహార్‌లో దోపిడీగాళ్లు బరితెగించారు. ఏకంగా ఓ రైల్వే ట్రాక్‌నే దొంగిలించారు. అక్కడో ట్రాక్ ఉందనే ఆనవాళ్లు లేకుండా మాయం చేశారు.

Bihar : ఏకంగా రైల్వే ట్రాక్‌నే చోరీ చేసిన దొంగలు.. సహకరించిన RPF సిబ్బంది

Railway Track theft In bihar

Bihar :  బీహార్‌లో దోపిడీగాళ్లు బరితెగించారు. ఏకంగా ఓ రైల్వే ట్రాక్‌నే దొంగిలించారు. అక్కడో ట్రాక్ ఉందనే ఆనవాళ్లు లేకుండా మాయం చేశారు. చాలాకాలంగా మూతపడ్డ రైల్వే ట్రాక్ చోరీ చేసిన దొంగలకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పీఎఫ్) సిబ్బంది సహకరించటం మరో విశేషం. ఇలా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా బీహార్‌లో దొంగలు ఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి అక్కడొక రైల్వే ట్రాక్ ఉండేదనే ఆనవాళ్లు కూడా లేకుండా మాయం చేశారు. కోట్ల రూపాయల విలువైన రైల్వే ఆస్తి సొంత ఆస్తిలా అమ్మేసుకున్నారు. ఈ విషయంకాస్తా బయటపడటంతో దొంగలకు సహకరించిన ఆర్‌పీఎఫ్ సిబ్బంది బాగోతం కూడా బయటపడింది. ఆర్‌పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు.

58 Foot Bridge Theft : వామ్మో..58 అడుగుల బ్రిడ్జినే ఎత్తుకుపోయిన దొంగలు..షాక్ అయిన పోలీసులు

ఈ చోరీ గురించి సమస్తిపూర్ రైల్వే డివిజన్ మేనేజర్ అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ..ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని రిపోర్టు వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చోరీకి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝంజర్ పూర్ ఆర్‌పిఎఫ్ అవుట్ పోస్ట్ ఇన్ చార్జ్ శ్రీనివాస్, జమాదార్ ముఖేశ్ కుమార్ సింగ్‌తో సహా ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు. మధుబని జిల్లాలోని బెలాహీలో ఉన్న లోహత్ షుగర్ మిల్‌కు సంబంధించి రవాణా సదుపాయం కోసం అప్పట్లోనే రైల్వే శాఖ ఓ ట్రాక్ వేసింది. ఈ మిల్ మూతపడింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ కూడా నిరుపయోగంగా మారింది. అలా దాదాపు 20 ఏళ్లుగా ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలు నిలిచిపోవటంతో రైల్వే అధికారులు కూడా ఆ ట్రాక్ ను పట్టించుకోవడం లేదు.

Bridge Stolen : బాబోయ్.. ఏకంగా 80అడుగుల బ్రిడ్జ్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడో తెలుసా

అలా నిరుపయోగంగా పడి ఉన్న ట్రాక్ గురించి అధికారులు కూడా పట్టించుకోవటం మానేసారు. సాధారణంగా ఇలా నిరుపయోగంగా ఉండే ట్రాక్ లను రైల్వే శాఖ టెండర్లు పిలిచి, స్క్రాప్ కింద విక్రయించాలి. కానీ ఈ ట్రాక్ విషయంలో అధికారులు పట్టించుకోకపోవటంతో దొంగల కళ్లు పడ్డాయి. ఎవ్వరు పట్టించుకోని ఆ ట్రాక్ ను సొమ్ము చేసుకోవాలనుకున్నారు. దీంతో పక్కా స్కెచ్ తో, ఆర్ పీఎఫ్ సిబ్బంది సహకారంతో ట్రాక్ ను మాయం చేశారు దొంగలు. దీనిపై జరిగిన ప్రాథమిక విచారణలో కొంతమంది ముఠాగా ఏర్పడి..ఆర్ పీఎఫ్ సిబ్బంది సహకారంతో ట్రాక్ ను అమ్మేసి సొమ్ము చేసుకున్నారని తేలింది. ఇక మరి అధికారులు దొంగలకు సహకరించిన సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరి.

Read more :  వంతెనను వదల్లేదు : ఢిల్లీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీ చోరీ!