Dowry Harassment : అదనపు కట్నం కోసం భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త
కొందరు మనుషులు డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మూడు ముళ్లువేసి తాళి కట్టిన భార్య అదనపు కట్నం తేలేదని ఆమెతో వ్యభిచారం చేయిస్తున్న భర్త ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.

Wife Fails To Pay Dowry, Husband Brings Men Home To Rape Her
Dowry Harassment : కొందరు మనుషులు డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మూడు ముళ్లువేసి తాళి కట్టిన భార్య అదనపు కట్నం తేలేదని ఆమెతో వ్యభిచారం చేయిస్తున్న భర్త ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.
రాజస్ధాన్ లోని ధోల్ పూర్ జిల్లా బసేరి పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే మహిళకు(23) 5 నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. పెళ్లై కాపురానికి వచ్చినప్పటి నుంచి భర్త,అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం ఆమెను వేధించసాగారు.మరుదులు ఆమెను చిత్రహింసలకు గురిచేసేవారు. అయినా ఆమె పుట్టింటివారు పేదవారు కావటంతో ఆమె అదనపు కట్నం తీసుకురాలేక పోయింది.
ఇంతలో భర్తలోని మృగాడు నిద్రలేచాడు. ఇతర మగాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని వారిని తన భార్య వద్దకు పంపటం మొదలెట్టాడు. వారు వచ్చిఆమెపై అత్యాచారం చేసేవారు. రాన్రానుభర్త అరాచకం పెరిగేసరికి ఆమె తన పుట్టిటింకి వెళ్లిపోయింది. అనంతరం బసేరి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. భార్య కేసు పెట్టిందని తెలియగానే భర్త ఆమె కుటుంబ సభ్యులు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.