ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

ఏపీలో దిశ చట్టం అమల్లోకి వచ్చినా మృగాళ్లలో ఎలాంటి మార్పు రావట్లేదు. అనంతపురం జిల్లాలో ఓ దుర్మార్గుడు బాలికపై అత్యాచారానికి యత్నించాడు. 

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 04:18 AM IST
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Updated On : December 14, 2019 / 4:18 AM IST

ఏపీలో దిశ చట్టం అమల్లోకి వచ్చినా మృగాళ్లలో ఎలాంటి మార్పు రావట్లేదు. అనంతపురం జిల్లాలో ఓ దుర్మార్గుడు బాలికపై అత్యాచారానికి యత్నించాడు. 

తెలంగాణలో దిశ అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా, దిశ చట్టం ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందినా మృగాళ్లలో ఎలాంటి మార్పు రావట్లేదు. అనంతపురం జిల్లాలో ఓ దుర్మార్గుడు బాలికపై అత్యాచారానికి యత్నించాడు. 

ఎనిమిది సంవత్సరాల వయసున్న బాలిక మదరసాలో చదువుకోవడానికి వెళ్లింది. ఓ ప్రైవేట్‌ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న జగదీశ్‌ అనే వ్యక్తి బాలికను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికెళ్లింది. జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. 

బాలిక కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.