ప్రేమించాడు…. పెళ్ళి చేసుకోమనే సరికి అత్యాచారం చేయబోయాడు.

  • Published By: chvmurthy ,Published On : April 13, 2020 / 11:58 AM IST
ప్రేమించాడు…. పెళ్ళి చేసుకోమనే సరికి అత్యాచారం చేయబోయాడు.

Updated On : April 13, 2020 / 11:58 AM IST

ప్రేమ పేరుతో  మోసం చేసి.. పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతున్న మోసగాడి ఘటన నల్గోండ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని  చింతపల్లి మండలంలోని  ఒక గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు  రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.  

ఈవిషయం ఇంట్లో వాళ్లకు  తెలియక ఆమెకు వేరే యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో ఆమె ప్రియుడికి విషయం చెప్పింది.  ప్రియుడి ఒత్తిడితో..పెద్దలకు చెప్పి ఆ సంబంధం రద్దు చేయించింది. 

కొంతకాలం ఈ ప్రేమ పక్షులు లవ్ ను ఎంజాయ్ చేశారు. తర్వాత తనను పెళ్లి చేసుకోమని ఆ యువతి కోరగా ఎప్పటి కప్పుడూ ఏవో మాటలు చెప్పివాయిదా వేసుకుంటూ వస్తున్నాడు.  గత శనివారం ఏప్రిల్ 11వ తేదీ రాత్రి  పనిమీద బయటకు వచ్చిన యువతిని కలిసిన ప్రియుడు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి  అత్యాచారం చేయబోయాడు.

అతడి ప్రవర్తనకు కంగారు పడిన ప్రియురాలు గట్టిగా కేకలు వేయటంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.  దీంతో బాధితురాలు తేరుకుని జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు  నిందితుడి కోసం గాలిస్తున్నారు.