కారణం అదేనా : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. స్టాల్స్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 03:58 PM IST
కారణం అదేనా : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం

Updated On : January 30, 2019 / 3:58 PM IST

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. స్టాల్స్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. స్టాల్స్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

 

తొక్కిసలాటలో చాలామందికి గాయాలయ్యాయి. ఇంకా అనేకమంది స్టాల్స్‌లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో వందలాది మంది సందర్శకులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వస్తుంటారు. అయితే ఊహించని విధంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో స్టాల్స్ కొలువుదీరాయి. ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేసిన స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం అందుతోంది.

 

ప్రస్తుతం నుమాయిష్‌ జరుగుతుండటంతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారు. 2019, జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి అనూహ్య రీతిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆరేడు స్టాల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనూహ్యంగా అగ్నిప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల వారు కూడా భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఓ కాలేజీ, ఉమెన్స్ హాస్టల్ కూడా ఉంది. విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. స్టాల్స్‌లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సందర్శకులు లోన ఉన్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.