రోడ్డు ప్రమాద బాధితులకు అండ : రోడ్ సేఫ్టీ వలంటీర్లు

  • Published By: chvmurthy ,Published On : January 24, 2020 / 02:14 AM IST
రోడ్డు ప్రమాద బాధితులకు అండ : రోడ్  సేఫ్టీ వలంటీర్లు

Updated On : January 24, 2020 / 2:14 AM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు తగిన సహాయం చేయడంతోపాటు వారిని వెంటనే  ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించేందుకు రోడ్ వలంటీర్లను సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు  గ్రేటర్ హైదరాబాద్  ట్రాఫిక్ పోలీసుశాఖ సౌజన్యంతో ఎమర్జెన్సీ మేనేజ్ అండ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్(ఈఎంఆర్) ఆధ్వర్యంలో నగరంలోని ప్రమాదం జరిగే ప్రాంతాల వద్ద గల స్థానికులకు శిక్షణనిస్తున్నారు. వారు బాధితులను వెంటనే  ఆస్ప్రతికి తీసుకు వెళ్లి తగిన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియమించిన రోడ్ కమిటీకి రాష్ర్టాలు ప్రతి మూడు నెలలకోసారి రోడ్డు ప్రమాదాలపై సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో నగరంలోని ట్రాఫిక్ విభాగం గ్రేటర్ పరిథిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించింది. ఏడాదిలో వరుసగా ఐదు ప్రమాదాలు, అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతాన్ని, రోడ్డు స్ట్రెచ్ బ్లాక్ పేర్కొంటూ ట్రాఫిక్ విభాగం జీహెచ్ ఓ నివేదిక సమర్పించింది.
road volunteers 3

అందులో 52 బ్లాక్ ప్రాంతాలను పేర్కొంటూ, ఆయాచోట్ల ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా వారు సూచించారు. 2018లో 118 బ్లాక్ లను గుర్తించగా, ఆయా ప్రాంతాల్లో జీహెచ్ తగిన నివారణ చర్యలను తీసుకుంది. కాగా, తాజాగా అందులోనే 52ప్రాంతాల్లో మళ్లీ ప్రమాదాలు పునరావృతం అవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తేల్చారు. అతివేగం, రాంగ్  సైడ్ లో వాహనదారుల ప్రయాణించటం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నట్లు  తెలిసింది. ప్రమాదాలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను కూడా ట్రాఫిక్ విభాగం సూచించింది. దీంతో జీహెచ్ అధికారులు ట్రాఫిక్ విభాగం సూచనల ప్రకారం ఆయా ప్రాంతాలవారీగా నివారణా చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కమిటీ సూచనల ప్రకారం మరణాల నివారణకు….
మరోవైపు, రోడ్ కమిటీ మార్గదర్శకాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించకుండా చూడడం ప్రధాన కర్తవ్యం. గడచిన ఏడాదిలో నగరంలో రోడ్డు ప్రమాదాల్లో 230మంది మరణించారు. ప్రధానంగా కూకట్ పల్లి నుంచి  పటాన్ చెరు  వెళ్లే  దారిలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు  గుర్తించారు. అంతకుముందు ఏడాది 340మంది మరణించగా, ఈ ఏడాది దాదాపు 30శాతం మరణాలు తగ్గినట్లు తేలింది.  
road volunteers 2
ఈనేపథ్యంలో మరణాలను నివారించడమే లక్ష్యంగా రోడ్ వలంటీర్లను సిద్ధం చేస్తున్నారు. గుర్తించిన ఆయా బ్లాక్ ప్రాంతాల్లో వుండే స్థానికులకు ప్రమాదాల బాధితులకు అందించాల్సిన ప్రాథమిక చర్యలపై శిక్షణనివ్వడమే కాకుండా వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. వారు వెంటనే 108 వాహనం, అంబులెన్స్, లేక పోలీసులకు సమాచారం అందించడంతో పాటు బాధితులను  ఆస్పత్రిలో చేర్పించి తగిన చికిత్స చేయించేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆస్పత్రుల్లో  రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సను నిరాకరించకూడదు. ముందుగా ప్రాణాన్ని కాపాడేందుకు తగిన వైద్యాన్ని అందించడం తప్పనిసరి.
road safety నగరంలో ప్రమాదాలు పునరావృతమైన బ్లాక్ స్పాట్లు
వైఎంసీఏ జంక్షన్, చిక్కడపల్లి క్రాస్, ప్యాట్నీ క్రాస్, సికింద్రాబాద్ స్టేషన్ రోడ్, తాడ్ బంద్ క్రాస్, బోయిన్ పల్లి క్రాస్, ఓల్డ్ ఆనంద్ థియేటర్-బేగంపేట్, మోర్ సూపర్ మార్కెట్ కృష్ణా నగర్ జంక్షన్, షేక్ పేట ఎంఆర్ఓ ఆఫీస్, రోడ్ నెం-12 కమాన్-బంజారాహిల్స్, పెద్దమ్మ టెంపుల్ జంక్షన్-జూబ్లీహిల్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు రోడ్ నెం-45-జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ బస్తీ జంక్షన్, నిరంకారీభవన్ జంక్షన్-లక్డీకాపూల్, సీజీఓ టవర్స్-కవాడిగూడ, అశోక్ నగర్ క్రాస్ రోడ్, ఆర్ క్రాస్ ఆంధ్రాబ్యాంక్ జంక్షన్-కోఠీ, అఫ్జల్ గంజ్ టీ జం క్షన్, సెంట్రల్ బస్ స్టేషన్, చాదర్ ఘాట్ క్రాస్, పుత్లీబౌలీ క్రాస్,  ఫీవర్ హాస్పిటల్ క్రాస్, విద్యానగర్ క్రాస్, తాజ్ ఐలాండ్, మాసాబ్ ట్యాంక్ జంక్షన్, ఎన్ ఎంజే మార్కెట్, రేతీబౌలీ, బాపూఘాట్-లంగర్ హైస్ , తారామతి బారాదరి, లంగర్  హైస్ దర్గా, సెవెన్ మెటర్నిటీ హాస్పిటల్-పెట్లబుర్జు, మదీనా క్రాస్, ధోబీఘాట్ క్రాస్, ఐఎస్ సదన్ జంక్షన్, చంపాపేట్ క్రాస్, మారుతీనగర్ బండ్లగూడ(ఫలక్ దత్తునగర్-మిథానీటౌన్ ఓమర్ బహబూబ్ క్రాస్ చాంద్రాయణగుట్ట), ఫలక నుమా  రైల్వేబ్రిడ్జీ, డీఎంఆర్ క్రాస్, ఫిసల్ టీ జంక్షన్, తాడ్బంద్  క్రాస్, పురనాపూల్ దర్వాజా ఉన్నాయి.
telugu talli fly over
ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ విభాగం జీహెచ్ సూచించిన చర్యలు
> లేన్ జీబ్రా మార్కింగ్
> స్టడ్స్ ఏర్పాటు. వేగనియంత్రణకు రంబుల్ స్ట్రిప్స్
> వేగ నియంత్రణ బోర్డులు, పాదచారుల క్రాసింగ్ వద్ద సైనేజీ బోర్డులు
> మెట్రో పిల్లర్లపై రేడియం స్టిక్కర్లు
> రోడ్ల మరమ్మతులు, జంక్షన్ విస్తరణ
> పాదచారుల వంతెనలు, స్కైవాక్ నిర్మాణం
> సెంట్రల్ మీడియన్ల ఎత్తు పెంపు, సెంట్రల్ మీడియన్లలో గ్రిల్స్ ఏర్పాటు, ఫుట్ గ్రిల్స్ ఏర్పాటు
> రాంగ్ డ్రైవింగ్ నియంత్రణకు ఎన్
> వీధిలైట్ల ఏర్పాటు, రోడ్లు, జంక్షన్ విస్తరణ
> వాహనాల పార్కింగ్ నియంత్రణకు చర్యలు