Chittoor Robbers Gang : చిత్తూరులో దొంగల ముఠా బీభత్సం.. వ్యాపారి ఇంట్లోకి చొరబాటు, మారణాయుధాలతో హల్‌చల్

ఏడుగురు దొంగల్లో ముగ్గురిని అనంతపురం, ముగ్గురు నంద్యాల, ఒకరు చిత్తూరు వాసులుగా గుర్తించారు పోలీసులు.

Chittoor Robbers Gang : చిత్తూరులో దొంగల ముఠా బీభత్సం.. వ్యాపారి ఇంట్లోకి చొరబాటు, మారణాయుధాలతో హల్‌చల్

Updated On : March 12, 2025 / 4:51 PM IST

Chittoor Robbers Gang : చిత్తూరు నగరంలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. దొంగల ముఠా కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేశారు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి చొరబడ్డారు ఏడుగురు దొంగలు.

మారణాయుధాలతో దొంగలు హల్ చల్ చేశారు. దొంగల దాడిలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. నలుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ముగ్గురు దొంగలు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఏడుగురు దొంగల్లో ముగ్గురిని అనంతపురం, ముగ్గురు నంద్యాల, ఒకరు చిత్తూరు వాసులుగా గుర్తించారు పోలీసులు. జిల్లా ఎస్పీ మణికంఠ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

ఇది చోరీకి జరిగిన ప్రయత్నంగానే తెలుస్తోంది. చిత్తూరు నగరంలో పుష్ప కిడ్స్ వరల్డ్, ఫర్నీచర్ షాప్ నడుపుతున్న వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లో చోరీకి ఏడుగురు సభ్యుల ముఠా ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చంద్రశేఖర్ ఇంట్లో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డమ్మీ పిస్టల్ తో చంద్రశేఖర్ ను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే, దొంగల కన్నుగప్పి చంద్రశేఖర్ వారిని గదిలో బంధించి పక్కనే ఉన్న మరో ఇంటి బాల్కనీలోకి జంప్ చేశారు. అక్కడి నుంచి ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read : అందుకే వైఎస్ జగన్‌కు దూరం అయ్యాను.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తన ఇంట్లోకి దొంగలు చొరబడ్డారని పోలీసులతో చెప్పారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా పోలీసులు చంద్రశేఖర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కమాండో ఆపరేషన్ చేపట్టిన పోలీసులు ఇంట్లోకి దూరి అక్కడే ఉన్న నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న రెండు పిస్టల్స్ డమ్మీవేనని తెలుస్తోంది. ఫర్నీచర్ షాప్ నడుపుతున్న చంద్రశేఖర్ కు అదే రంగంలో కొంతమంది శత్రువులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చంద్రశేఖర్ కు బాగా తెలిసిన వ్యక్తులే పక్కా పథకం ప్రకారం ఒక సుపారీ గ్యాంగ్ ను నియమించి వారి ద్వారా చోరీకి యత్నించినట్లు తెలుస్తోంది.