Pista House Incident : పిస్తాహౌజ్‌లో రౌడీ గ్యాంగ్ బీభత్సం, కస్టమర్లను ఎలా కొట్టారో చూడండి..

ఆ గ్యాంగ్ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొత్తం 15మంది చొరబడి హోటల్ లో వీరంగం చేశారు.

Pista House Incident : పిస్తాహౌజ్‌లో రౌడీ గ్యాంగ్ బీభత్సం, కస్టమర్లను ఎలా కొట్టారో చూడండి..

Pista House Incident

Updated On : March 3, 2024 / 6:45 PM IST

Pista House Incident : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలోని పిస్తా హౌజ్ లో ఓ రౌడీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. హోటల్ లోకి చొరబడిన గ్యాంగ్.. భోజనం చేస్తున్న కస్టమర్లపై దాడికి తెగబడింది. సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తూ రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. హోటల్ లోని సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు. దీంతో కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణభయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.

హోటల్ లో బీభత్సం సృష్టించిన గ్యాంగ్ సభ్యులు.. పార్కింగ్ లో ఉన్న వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ఆ గ్యాంగ్ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొత్తం 17మంది చొరబడి హోటల్ లో వీరంగం చేశారు. హోటల్ యాజమాన్యం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

హోటల్ లోకి చొరబడిన రౌడీ గ్యాంగ్.. అక్కడ భోజనం చేస్తున్న కస్టమర్లపై దాడికి దిగారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. పిడిగుద్దులు కురిపించారు. భయాందోళనకు గురి చేశారు. హోటల్ లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. సడన్ గా రౌడీ గ్యాంగ్ లోపలికి రావడం, దాడి చేయడంతో.. కస్టమర్లు భయపడిపోయారు. ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా, దాడికి పాల్పడ్డ రౌడీ మూకలను హోటల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపైనా కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ రౌడీలు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు? రౌడీమూకలు పిస్తా హౌస్ లోకి చొరబడి ఎందుకు ఇలా దాడి చేశారు? పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? లేక కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలా వీరంగం చేశారా? ఇలా అన్ని కోణాల్లో అత్తాపూర్ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Also Read : రూ.12లక్షల కెమెరా కోసమే హత్య..! సంచలనం రేపిన విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి కేసులో వీడుతున్న మిస్టరీ